Kuldeep-RCB: రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) జట్టుకు కేవలం బెంగళూరులోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ప్రధాన కారణం ఈ జట్టుకు విరాట్ కోహ్లీ ప్రాతినిత్యం వహిస్తుండడం. కానీ రాయల్ చాలెంజర్స్ ( Royal Challengers Bangalore) బెంగళూరు జట్టుకి ఐపీఎల్ టైటిల్ అనేది ఓ అందని ద్రాక్షలా మారింది.
Also Read: Indian Cricketers Salary: రంజీ మ్యాచ్ లు ఆడితే.. టీమిండియా ప్లేయర్లకు ఎంత జీతం వస్తుంది?
ప్రతి సంవత్సరం జట్టులోని ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఆర్సిబి అభిమానులు మాత్రం ఆ జట్టు ఎప్పుడు టైటిల్ గెలుస్తుందా..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఈసారి కప్పు మాదే అంటూ హంగామా చేస్తుంటారు. గత 17 సీజన్లుగా ఈ సాలా కప్ నమ్దే అని ఆర్సిబి చెబుతూనే ఉంది. 2024 ఐపీఎల్ సీజన్ 17 లో కూడా ఆర్సీబీకి నిరాశ ఎదురైంది.
ఎలిమినేటర్ మ్యాచ్ ( Eliminator match) లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సిబి ఓటమి చెందింది. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( women’s Premier League) ప్రారంభమైన తక్కువ సీజన్లకే ఆర్సీబీ మహిళల జట్టు ట్రోఫీని ముద్దాడడంతో ఆర్సీబీ అభిమానులు సైతం సహనం కోల్పోయి ఆటగాళ్లపై ట్రోల్స్ చేశారు. ఇక ఈ సంవత్సరమైనా ( IPL 2025) ఆర్సీబీ టైటిల్ కొట్టాలనే కోరిక నెరవేరుతుందేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై తాజాగా భారత స్పిన్ బౌలర్ కూల్దీప్ యాదవ్ సెటైర్లు వేశారు. తాజాగా కుల్దీప్ యాదవ్ టాక్ ఫుట్బాల్ హెచ్డీ కి చెందిన జిషన్ ఖాన్ తో కలిసి యూట్యూబ్ లైవ్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారు కుల్దీప్ యాదవ్. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కుల్దీప్ ఆర్సిబి అభిమానానికి బదిలీస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.
ఈ లైవ్ స్టేషన్ లో ఓ ఆర్సిబి అభిమాని.. కుల్దీప్ ని తమ జట్టులో చేరమని కోరాడు. బెంగళూరు ఫుడ్ బాల్ జట్టులో గోల్ కీపర్ పోస్ట్ ఖాళీగా ఉందని.. ఆ కారణంగా జట్టులో చేరమని అభ్యర్థించాడు. దీంతో ఆ అభిమానికి కౌంటర్ ఇచ్చారు కుల్దీప్. “మీకు గోల్ కీపర్ అవసరం లేదు. ట్రోఫీ కావాలి. గోల్ కీపర్ తో మీరేం చేస్తారు” అని వ్యాఖ్యానించాడు.
Also Read: Shardul Thakur: టీమిండియాలో మరో డేంజర్ ఆలౌ రౌండర్.. 8వ స్థానంలో సెంచరీలు ?
ఈ వ్యాఖ్యలతో ఆర్సిబి అభిమానులు కుల్దీప్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ పై మరోసారి ఎక్స్ లో స్పందించాడు కుల్దీప్. ” చిన్ ఆర్సిబి ఫ్యాన్స్. ట్రోఫీ మీదే. కానీ నేను గోల్ కీపర్ కాదు” అని ట్వీట్ చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన బెంగళూరు అభిమానులు కుల్దీప్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.
Kuldeep Yadav is in a troll mood 👀#kuldeepyadav pic.twitter.com/1REK1DnGRc
— InsideSport (@InsideSportIND) January 25, 2025