BigTV English

Kiran Royal Audio Leak: నాకు రోజుకొక అమ్మాయి కావాలి.. కిరణ రాయల్ ఆడియో వైరల్

Kiran Royal Audio Leak: నాకు రోజుకొక అమ్మాయి కావాలి.. కిరణ రాయల్ ఆడియో వైరల్

Kiran Royal Audio Leak: తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చీకటి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల కిరణ్ రాయల్ భాగోతాలన్ని లక్షి అనే మహిళ బయటపెట్టారు. రూ. కోటికిపైగా నగదు, 25 సవర్లకు పైగా గోల్డ్ కాజేశారని.. ఆర్ధిక ఇబ్బందుల్లో నెట్టేశాడని.. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఈ మధ్య లక్షి అనే మహిళ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.


తాజాగా కిరణ్ రాయల్ మరో ఆడియో బయటకొచ్చింది. తనకు రోజుకొక అమ్మాయి కావాలంటూ మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. నాకు రోజుకొక అమ్మాయి కావాల్సిందే.. అంటూ లక్ష్మి అనే మహిళతో ఆయన మాట్లాడారు. నా దృష్టిలో నువ్వు కూడా అంతే అంటూ ఆమెతో మట్లాడారు. దీనిపై వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు. పవిత్రమైన తిరుపతికి ఇలాంటి నీచుడిని ఇన్ఛార్జిగా నియమించావా పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే..రెండు రోజుల క్రితం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అనే మహిళ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. తనను ఓ మగాడు మోసం చేశాడని.. ఆడదాన్నైన తాను మొర పెట్టుకుంటే.. మోసగాడిపై సానుభూతి చూపించి.. మహిళనైన తనను వేదిస్తున్నారని లక్ష్మీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌ రాయల్‌ తనను ఎలా మోసం చేశాడు? తనపై కిరణ్‌ రాయల్‌ చేసిన ఆరోపణలకు అసలు నిజాలేంటనేది లైవ్‌లో వివరించారు లక్ష్మీ రెడ్డి. తనకు మార్ఫింగ్‌ అంటే ఏంటో తెలియదని.. కిరణ్‌ చూపించిన ఫోటోల తాలూకు ఒరిజినల్‌ ఫోటోలను చూపించారు. కిరణ్‌ రాయల్‌ అనుచరులకు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చేసిన పేమెంట్స్‌ ప్రూఫ్స్‌ను మీడియా ముందుంచారు. కిరణ్‌ రాయల్‌కు పవన్‌ సపోర్ట్‌ లేదంటే తాను నమ్మనన్నారు.


ఈ వివాదంలోకి మాజీ మంత్రి రోజా కుటుంబాన్ని లక్ష్మిరెడ్డి లాగారు. రోజా బంధువులను కూడా కిరణ్ రాయల్ భార్య గతంలో బెదిరించిందని అన్నారామె. అప్పట్లో రోజాపై కిరణ్ రాయల్‌ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన రోజు తెల్లవారు జామున కిరణ్ భార్య రేణుక రోజా బంధువుల్లో ఓ మహిళకు కాల్ చేసి వారి వీడియోలు ఉన్నాయని బెదిరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్.. లా అండ్ ఆర్డర్ ఎక్కడంటూ ప్రశ్న

ఆ తర్వాత కిరణ్ రాయల్ ను పోలీసులు రిలీజ్ చేశారని తెలిపారు లక్ష్మీ రెడ్డి. ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. లక్ష్మీ రెడ్డి కామెంట్స్ తో పాత కేసు ఇప్పుడు తెరపైకి వస్తోంది. అసలు కిరణ్ రాయల్ భార్య రేణుక ఎవరిని బెదిరించారానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కిరణ్‌ రాయల్ తనతో ఎంత అసభ్యంగా మాట్లాడాడనేది.. కాల్‌ రికార్డ్స్‌ ద్వారా మరోసారి బయటపెట్టారు, లక్ష్మిరెడ్డి. తనను వేధించిన అతనిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌ రాయల్‌పై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×