Janhvi Kapoor Devara 2 : జాన్వి కపూర్… శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే పరిచయం. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది జాన్వీ కపూర్ 2018 లో రిలీజ్ అయిన ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్, బాడ్ లక్ జెర్రీ, మిల్లీ వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలేవి కూడా సరైన గుర్తింపును జాన్వికి తీసుకురాలేదు. ఈ రోజుల్లో సినిమాలు ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది ఫ్యాన్స్ క్రియేట్ అవుతూ ఉంటారు అలా జాన్వి కు కూడా క్రియేట్ అయ్యారని చెప్పొచ్చు.
ఇకపోతే జాన్వి కపూర్ తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అంటూ చాలామంది ఎదురు చూశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ కనిపించింది జాన్వి. ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో కూడా జాన్వి మాట్లాడుతూ తెలుగులో ఏ స్టార్ తో పనిచేయాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, ఎన్టీఆర్ తో పని చేయాలనుకుంటున్నాను అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. మొత్తానికి దేవర సినిమాతో జాన్వీ కల నిజమైంది. ఈ సినిమా హిట్ అవడంతో జాన్వికి వరుసగా తెలుగులో కూడా అవకాశాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వి కపూర్ కనిపించనుంది. జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా జాన్వి చేస్తున్న ప్రాజెక్టు నుంచి బర్తడే పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ సి 16 నుంచి జాన్వీ కపూర్ లుక్ రివిల్ అయింది.
ఇక తాజాగా దేవర చిత్ర యూనిట్ జాన్వి కపూర్ లుక్ ను రివిల్ చేసింది. ఇ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ లుక్ లో నోటిలో కత్తిపెట్టుకొని ఒక ఇంటెన్స్ లుక్ తో చూస్తుంది జాన్వి. అంతేకాకుండా తనతో పాటు చేపను పట్టుకుంది. ఇక ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కత్తి పట్టుకున్న లుక్ చూస్తూ ఉంటే చాలామందికి సీక్వెల్ లో తంగం ఫైట్ చేయబోతుందా అనే ఆలోచనలు మొదలయ్యాయి. ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే “కోరమీనా నేను కోసుకుంటా” అనే పాట బాగా పాపులర్ అయింది. లేదంటే జాన్వి అదే చేపను పట్టుకొని వెళ్తుందా ఏదో ఒక రొమాంటిక్ సాంగా అని డిస్కషన్స్ మొదలయ్యాయి.