Akhil Movie: అక్కినేని అఖిల్ ((Akkineni Akhil) హీరోగా, సయేషా సైగల్ (Sayyeshaa Saigal )హీరోయిన్ గా 2015 నవంబర్ 11న విడుదలైన చిత్రం అఖిల్ (Akhil). శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ (Nithin), సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) నిర్మించిన ఈ సినిమాకి వి.వి. వినాయక్ (VV.Vinayak) దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar), బ్రహ్మానందం (Brahmanandam) వంటి భారీ తారాగణం భాగమైంది. అనూప్ రూబెన్స్(Anup Rubens), ఎస్.ఎస్.తమన్(SS.Thaman), మణిశర్మ (Manisharma) ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పనిచేయగా.. కోనావెంకట్ (Kona Venkat) డైలాగ్ రచయితగా పనిచేశారు. భారీ తారాగణంతో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇలా డిజాస్టర్ గా మారడానికి కారణం వి.వి.వినాయక్ అంటూ రచయిత కోనా వెంకట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Local Boy Nani : అంత కక్కుర్తి ఎందుకు… లోకల్ బాయ్ నానిపై ప్రపంచ యాత్రికుడు ఫైర్..!
అఖిల్ ఫ్లాప్ కి వినాయక్ కారణం..
ప్రముఖ రచయితగా, ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్న కోనా వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘అఖిల్’ సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణాలను వెల్లడించారు.. అఖిల్ సినిమా కథను అందరూ యాక్సెప్ట్ చేసారా..? మరెందుకు సినిమా డిజాస్టర్ అయ్యింది..? అని ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కోనా వెంకట్ మాట్లాడుతూ.. “అఖిల్ సినిమా కథను ఎంచుకున్నప్పుడు ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని, వద్దని నేను అడ్డుపడ్డాను. వినాయక్ ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ముఖ్యంగా నా ఒక్కడి వల్ల కాకపోవడంతో వినాయక్ స్నేహితులతో కూడా నేను వద్దని చెప్పించే ప్రయత్నం చేశాను. ఇక తోటి డైరెక్టర్స్ కూడా ఈ విషయాన్ని చెప్పగా.. వినాయక్ మాత్రం “లేదు.. నన్ను నమ్మండి” అంటూ చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్లారు. ఒక హిట్ కి కారణం నమ్మకం అయితే.. ఒక ఫ్లాప్ కి కారణం గుడ్డి నమ్మకం. ఈ సినిమా సక్సెస్ అవుతుందని వి.వి. వినాయక్ గుడ్డిగా నమ్మాడు. కానీ నేను డిజాస్టర్ అవుతుందని అంతకంటే ఎక్కువ నమ్మాను.. తన మైండ్ లో ఏదో ఎక్కేసింది అందుకే ఎంత చెప్పినా వినలేదు. అఖిల్ డిజాస్టర్ కి కారణం వివి వినాయక్” అంటూ కోనా వెంకట్ తెలిపారు.
వి.వి.వినాయక్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు..
వినాయక్ గురించి చెబుతూ.. ఎంతోమంది స్టార్స్ ను లీడ్ చేసిన అనుభవం ఆయనది. ప్రస్తుతం ఇంకో సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారు. ముఖ్యంగా స్టార్ హీరోలను లీడ్ చేసిన అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో వినాయక్ కూడా ఒకరు. నాకు సినిమా పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటూ వినాయక్ గురించి కోనా వెంకట్ తెలిపారు.. ఇక ప్రస్తుతం కోన వెంకట్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా అఖిల్ సినిమా డిజాస్టర్ అవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు కోనా వెంకట్.