BigTV English

Mohammed Siraj: వివాదంలో సిరాజ్‌…తిలకం ఎందుకు పెట్టుకోవు అంటూ ట్రోలింగ్‌ ?

Mohammed Siraj: వివాదంలో సిరాజ్‌…తిలకం ఎందుకు పెట్టుకోవు అంటూ ట్రోలింగ్‌ ?

Team India: భారతదేశం… ఒక హిందుత్వ దేశం. మన దేశం హిందుత్వ వాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ… అన్ని కులాలు అలాగే అన్ని మతాల ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్.. అన్న విధంగా మన ఇండియా ఉంటుంది. అయితే… అలాంటి భారతదేశంలో ముస్లింలను హిందువులు చాలా గౌరవిస్తారు. అదే సమయంలో హిందువులను కూడా ముస్లింలు అన్నదమ్ముల్లాగా చూసుకుంటారు. అయితే.. ఇలాంటి నేపథ్యంలో… హిందూ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు టీమిండియా ముస్లిం క్రికెటర్ల పై ( Indian Muslim Cricketers ).. రచ్చ జరుగుతుంది.


Also Read: Sanju Samson: రాజస్థాన్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు సంజూ దూరం.. అతనికి కెప్టెన్సీ ?

తాజాగా ఓ వీడియో.. వైరల్ కావడంతో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj )  , అలాగే ఉమ్రాన్ మాలిక్ లపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఇద్దరు ముస్లిం టీమిండియా క్రికెటర్లు ( Indian Muslim Cricketers )… భారతదేశాన్ని అవమానించారని… కొంతమంది హిందూ వాదులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం… ప్రతి ఒక్కరూ తిలకాన్ని పెట్టుకుంటారు. తిలకం పెట్టుకుంటే అతను హిందువు అని… ఈజీగా అర్థమవుతుంది.


అయితే టీమిండియా ఒక టూర్  కు వెళ్లి ఇండియాకు రావడంతో… అక్కడ బీసీసీఐ కి సంబంధించిన కొంతమంది మహిళలు… టీమిండియా క్రికెటర్లకు తిలకాన్ని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ క్రికెటర్లు అందరూ తిలకం పెట్టుకున్నారు. కానీ మహమ్మద్ సిరాజ్ అలాగే… ఉమ్రాన్ మాలిక్  ( Umran Malik ) మాత్రం… ఆ మహిళలు తిలకం పెడుతుంటే వద్దు అన్నారు. వాస్తవంగా ముస్లింలు ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు. అందుకే ఆ మహిళలు పెడుతున్న తిలకాన్ని… టీమిండియా క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) అలాగే ఉమ్రాన్ మాలిక్  ( Umran Malik )  ఇద్దరు కూడా వద్దన్నట్లు తెలుస్తోంది.

Also Read: Rajeev shukla: అందరి షర్ట్స్ విప్పి తిరగమన్నాడు.. గంగూలీపై రాజీవ్ శుక్లా సంచలనం!

అది హిందూ సంప్రదాయం. అయితే ఇక్కడ టీమిండియా క్రికెటర్లు చేసిన పనికి… సోషల్ మీడియాలో హిందువులు అలాగే కొంతమంది టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఆడుతున్నప్పుడు హిందూ సాంప్రదాయం పాటించాల్సిందేనని ముస్లిం క్రికెటర్ల పై కామెంట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు టీమిండియా కు ఎందుకు ఆడుతున్నారని కొంతమంది నిలదీస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్  ( Umran Malik ) లపై పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు.

అయితే… టీమిండియా ముస్లిం క్రికెటర్లు ( Indian Muslim Cricketers ) మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) అలాగే ఉమ్రాన్ మాలిక్  ( Umran Malik )  ఇద్దరు గతంలో చేసిన పనికి ఇప్పుడు తిట్టు తింటున్నారు. వాస్తవంగా ఈ సంఘటన 2023 సంవత్సరంలో చోటు చేసుకుంది. కానీ కొంత మంది హిందూ వాదులు ఇప్పుడు ఈ వీళ్ల వీడియోను వైరల్ చేసి.. ఆడుకుంటున్నారు. కాగా.. మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) అలాగే ఉమ్రాన్ మాలిక్  ( Umran Malik )  ఇద్దరు కూడా ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయారు.

 

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×