BigTV English

Jani Master on Ram Charan: సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు.. చరణ్ పై ప్రశంసలు కురిపించిన జానీ మాస్టర్

Jani Master on Ram Charan: సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు.. చరణ్ పై ప్రశంసలు కురిపించిన జానీ మాస్టర్

Jani Master on Ram Charan: మెగాస్టార్ చిరంజీవి.. ఆయన సినిమాల గురించి పక్కన పెడితే ఆయన సేవ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మెగాస్టారే ముందు ఉండి వారికి సహాయం చేస్తాడు. ఇక తండ్రి దానగుణం.. రామ్ చరణ్ కు కూడా అబ్బింది. తండ్రిని చూస్తూ పెరిగిన అతనికి.. సేవా గుణం కూడా అలవాటుగా మారింది. దానికి తోడు చరణ్ పక్కన ఉపాసన కూడా చేరడంతో సేవా కార్యక్రమాలకు ఈ దంపతులు సైతం ముందు ఉంటున్నారు.


తాజాగా ఈ జంట తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFTTDA) లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్నీ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. నేడు జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో.. ఆయనను చరణ్ ఇంటికి ఆహ్వానించాడు.

చిరు ఇంటికి వెళ్లిన జానీ మాస్టర్ ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. ఇక జానీ మాస్టర్ పుట్టినరోజు కానుకగా.. అంతకుముందు చరణ్ దంపతులు ఇచ్చిన మాట ప్రకారం TFTTDA లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించినట్లు తెలిపారు. దీంతో జానీ మాస్టర్ సంతోషంతో చరణ్ దంపతులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.


Also Read: Kalki Collections: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల రికార్డు..ఎంత వసూళ్లు చేసిందంటే!

“సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు.. నా పుట్టినరోజు సందర్భంగా చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది, ఉపాసన వదిన నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.

అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తండ్రికి తగ్గ తనయుడు అని ఊరికే అనలేదని చరణ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×