EPAPER

Viral Video: సముద్రంలోకి స్కూటీ నడుపుతూ వెళ్లాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: సముద్రంలోకి స్కూటీ నడుపుతూ వెళ్లాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: ఇంటర్నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ప్రస్తుతం ఓ మేనియా క్రియేట్ చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏం దర్శనమిస్తుందో ఎవరికి అంతుచిక్కదు. వీటిలో చాలా సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉంటే.. మరికొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి స్కూటర్ తీసుకుని సముద్రంలోని అలల్లోకి దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


సముద్రంలోకి స్కూటర్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వ్యక్తి స్కూటర్‌తో బీచ్‌కు వెళ్లాడు. హెల్మెట్ కూడా పెట్టుకుని మరి వెళ్లాడు. కొద్దిసేపటికి స్కూటర్‌ని సముద్రంలోకి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆ వ్యక్తి కొంత సేపటికి వెళ్లి తిరిగి వచ్చినట్లు అనిపించినా.. కానీ ఇంకా సముద్రం లోపలికి వెళుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి స్కూటర్‌ని లోతైన నీటిలోకి తీసుకెళ్లాడు. అయితే అతను తిరిగి రావడానికి ప్రయత్నించిన అతని స్కూటర్ మునిగిపోయింది. ఆ వ్యక్తి చాలాసార్లు స్కూటర్ హ్యాండిల్ కూడా పట్టుకోలేకపోయాడు. అనంతరం మళ్లీ స్కూటర్‌ని ఎత్తుకుని నడపడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నీటిలో మునిగిపోయినా స్కూటర్ ఆగలేదు. చాలా ప్రయత్నాల తరువాత, వ్యక్తి స్కూటర్‌తో అలల నుండి బయటకు తీసుకువచ్చాడు.


ఎట్టకేలకు స్కూటర్ ని బయటకు తీసుకువచ్చిన వ్యక్తి అసలు ఇలాంటి పని ఎందుకు చేశాడని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఇలాంటి స్టంట్ చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Roma Michael Bikini: ‘ఈ మహిళ నరకానికే వెళుతుంది’.. బికినీలో పాకిస్తాన్ మోడల్!

Kiss Allergy: ‘నన్ను ముద్దు పెట్టుకోవాలంటే షరతులు వర్తిస్తాయి’.. బాయ్‌ఫ్రెండ్స్‌కు యువతి కండీషన్స్ వైరల్

Fake Court In Gujarat: నిన్న ఫేక్ పోలీస్ స్టేషన్, నేడు ఫేక్ కోర్టు- చీటర్లు మరీ రాటుదేలుతున్నారు భయ్యా!

Leopard Attacks: చిరుత పులితో రీల్స్.. చీల్చి పడేసిందిగా, ఈ వీడియో చూస్తే వణికిపోతారు!

New Snake Species: హిమాలయాల్లోని అరుదైన పాముకు ఆ రొమాంటిక్ హీరో పేరు పెట్టిన పరిశోధకులు.. అది అంత స్పెషలా?

Leave For Piles: ‘నీకు పైల్స్ ఉందని ఆధారం చూపించు’.. లీవ్ అడిగినందుకు బాస్ కండీషన్.. ఎంత పని చేశాడంటే?.

Europe Techie Salary: ‘లండన్‌లో సాలరీ రూ.80 లక్షలు.. బెంగుళూరుకు వచ్చేయాలనుకుంటున్నాను’.. సోషల్ మీడియాలో భారత టెకీ వైరల్ పోస్ట్

Big Stories

×