BigTV English

Karthikeya 3: కార్తికేయ – 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలో అంటూ..!

Karthikeya 3: కార్తికేయ – 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలో అంటూ..!

Karthikeya 3..ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ‘హ్యాపీ డేస్’ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఇకపోతే కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా దృష్టిలో పడ్డ ఈ యంగ్ టాలెంటెడ్ హీరో.. అప్పటినుంచి యూనివర్సల్ అప్పీల్ ఉండే సబ్జెక్టును మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘స్పై’ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేయాలనుకున్నాడు. కానీ వివిధ కారణాలవల్ల ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’ వంటి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


95 శాతం షూటింగ్ పూర్తి.. రహస్యంగా షూటింగ్ కంప్లీట్..

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ‘కార్తికేయ-3’ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు నిఖిల్. నిఖిల్ మాట్లాడుతూ.. ” స్వయంభు సినిమా నా కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. దీనికోసం గత ఏడాది నుంచి నేను సిద్ధమవుతున్నాను. రహస్యంగా షూటింగ్ కూడా చేస్తున్నాము. ఇప్పటికే 95% చిత్రీకరణ కూడా పూర్తయింది.ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది” అంటూ తెలిపారు. ఇక భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో స్వయంభూ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ మూవీగా వస్తున్న ఇందులో నిఖిల్ ఒక వారియర్ గా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం కోసం గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్ వంటివి కూడా నేర్చుకున్నారట. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఇక పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్ (Nabha Natesh), సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ALSO READ:Court Movie:కోర్ట్ మూవీకి షాక్… అర్ధాంతరంగా షోను నిలిపివేసిన అధికారులు… అసలేమైందంటే..?

త్వరలోనే కార్తికేయ 3 షూటింగ్..

ఈ సినిమా తర్వాత నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కార్తికేయ -3 కూడా లైన్ లో ఉంది. దీని కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే ప్రారంభిస్తామని, చందు మొండేటి (Chandu Mondeti) స్క్రిప్టు రెడీ చేసే లోపు ‘ది ఇండియా హౌస్’ షూటింగ్ కంప్లీట్ చేస్తానని నిఖిల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి ప్రత్యేకతను చాటుకుంటాయని, ఈ మూడు చిత్రాలు తన లైఫ్ లో ఒక స్పెషల్ మూవీస్ అంటూ తెలిపారు నిఖిల్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×