BigTV English

Vishwak Sen: మెకానిక్ రాకీ సినిమాని మహారాజ సినిమాతో పోల్చాడు

Vishwak Sen: మెకానిక్ రాకీ సినిమాని మహారాజ సినిమాతో పోల్చాడు

Vishwak Sen: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకడు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామందికి ఈ సినిమా వచ్చిందని కూడా తెలియకుండా పోయింది. ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాతో తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను కూడా బయటికి తీసాడు విశ్వక్. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ మెకానిక్ రాకీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మామూలుగా విశ్వక్సేన్ సినిమా అంటేనే మంచి బజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా టాక్ వినిపించడం లేదు. ఇకపోతే దీనిపై విశ్వక్ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమాకి బజ్ రావట్లేదు అని అందరూ అంటున్నారు కానీ నేనే బజ్ ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


విజయ్ సేతుపతి కెరియర్లో 50వ సినిమాగా వచ్చింది మహారాజా. ఈ సినిమా మామూలుగా రొటీన్ స్టోరీ అయినా కూడా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా సినిమా మీద ఎవరికి అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక మామూలు కథను ఈ విధంగా చెప్పే విధానం చాలామందికి బాగా నచ్చింది. ఇప్పుడు విశ్వక్సేన్ నటిస్తున్న తన సినిమాను కూడా మహారాజా సినిమాతో పోలుస్తున్నాడు. వాస్తవానికి మెకానిక్ రాకీ సినిమా రిలీజ్ అవుతుంది అని చాలామందికి తెలియదు.

Also Read : Kanguva Collections: ఇవి జెన్యూన్ కలక్షన్స్ లా ఉన్నాయి బాసు


తన సినిమా ప్రమోషన్స్ ను విపరీతంగా చేస్తూ ఉంటాడు విశ్వక్. ఈ సినిమాకి సంబంధించి కొంతమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. అయితే సినిమాలో డెప్త్ ఉన్నప్పుడు ట్రైలర్ లో అంతా చూపించలేము అని చెబుతున్నాడు. అంతేకాకుండా నా సినిమాలో చాలా డెప్త్ ఉంది అంటూ రీసెంట్ గా చెప్పుకొచ్చాడు విశ్వక్. ఇకపోతే ఈ ఏడాది విశ్వక్ చేసిన 3వ సినిమా ఇది. అందరూ సంవత్సరానికి ఒక సినిమా, రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న తరుణంలో ఒక యంగ్ హీరో ఒకే ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేయడమనేది గొప్ప విషయం. ఇక విశ్వక్ ఈ సినిమాతో పాటు అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ప్రస్తుతం లైలా అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×