Anurag Kulakarni: టాలీవుడ్ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి.. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులోనూ మరో స్టార్ సింగర్ ను పెళ్ళాడి షాక్ ల మీద షాకులు ఇచ్చాడు. అనురాగ్ కులకర్ణి, మరో స్టార్ సింగర్ రమ్య బెహరా వివాహం నేడు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అనురాగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్ గా నిలవడంతో అతని రేంజ్ మారిపోయింది. ఆ తరువాత సినిమాలో వరుస సాంగ్స్ పాడుతూ స్టార్ సింగర్ గా మారాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో పిల్లారా సాంగ్ అనురాగ్ కు మంచి గుర్తింపును తీసుకురావడంతో పాటు అవార్డులను కూడా అందుకునేలా చేసింది.
Thandel First Single: సాయిపల్లవి బిగి కౌగిలిలో నాగచైతన్య.. బుజ్జితల్లి ఎంత అందంగా ఉందో
శ్యామ్ సింగరాయ్ లో ప్రణవాలయ సాంగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక రమ్య బెహరా కూడా ఎన్నో మంచి పాటలను పాడి మెప్పించింది. వీరిద్దరిది ప్రేమ వివాహామని తెలుస్తోంది. రమ్య బెహరా సూపర్ సింగర్ 4లో పాల్గొంది. కీరవాణీ.. ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశారు.
టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి లాంటి సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక ఈ జంట పెళ్లి చేసుకున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్.. కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.
Shanvi Srivastava: బీచ్ ఒడ్డున బికినీలో లవ్లీ బ్యూటీ.. సెగలు పుట్టిస్తుందిగా
అయితే ఇండస్ట్రీ నుంచి ఈ జంట ఎవరిని పిలవకుండా ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏంటి.. ? ఇది నిజంగానే ఒరిజినల్ ఫోటోయేనా..? అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ జంట అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.