BigTV English

OTT Movie : సీరియల్ కిల్లర్ కు చుక్కలు చూపించే చెవిటి అమ్మాయి… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : సీరియల్ కిల్లర్ కు చుక్కలు చూపించే చెవిటి అమ్మాయి… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ కంటెంట్ కోసం ప్రస్తుతం మూవీ లవర్స్ లో విపరీతంగా ఆకలి పెరిగిపోతోంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం మనమందరం ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తుండగా, మరోవైపు ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా కొరియన్ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి లయన్స్‌ గేట్ ప్లే. ఇప్పుడు 2021లో రిలీజై ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఓ కొరియన్ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి లయన్స్ గేట్ అనే ఈ ఓటీటీ సిద్ధం అవుతోంది. ఆ మూవీ స్టోరీ ఏంటి? ఎప్పటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..


స్టోరీ లోకి వెళ్తే.. 

కాల్ సెంటర్‌లో సైన్ లాంగ్వేజ్ కౌన్సిలర్ గా పని చేస్తుంటుంది చెవిటి, మూగ మహిళ క్యోంగ్-మిని. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఒకరోజు ఇంటికి వెళ్ళే సరికి బాగా చీకటి పడుతుంది. అలా వెళ్తుండగా సో-జంగ్‌ అనే అమ్మాయిని సీరియల్ కిల్లర్ దో-సిక్‌ కత్తితో పొడిచి చంపడాన్ని చూస్తుంది. అతను కూడా ఆమెను చూడడంతో ఆట మొదలవుతుంది. సో-జంగ్ సోదరుడు, సెక్యూరిటీ గార్డు అయిన జోంగ్ తక్ తన సోదరి, క్యోంగ్-మి ఇద్దరినీ రక్షించడానికి బయలు దేరాడు. ఇంతలో క్యోంగ్-మి చెవిటి, మూగ తల్లి కూడా వారిని రక్షించే ప్రయత్నం మొదలు పెడుతుంది. అయితే ఆ సీరియల్ కిల్లర్ వీళ్లందరిని ఒక్కొక్కరిగా చంపడానికి ప్లాన్ చేస్తాడు. మరి చివరికి హీరోయిన్ వాడి నుంచి తప్పించుకోగలిగిందా? ఆ సీరియల్ కిల్లర్ ను పోలీసులకు పట్టించగలిగిందా? అసలు చెవిటి, మూగ అమ్మాయి అయిన ఆ హీరోయిన్ కు హెల్ప్ దొరికిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ థ్రిల్లర్ మూవీని చూసి తీరాల్సిందే. ఈ మూవీ 2021లో కొరియాలోనే బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుని తప్పనిసరిగా చూడవలసిన జాబితాలలో చేరిపోయింది.


Midnight (2022) | Movie Clip "You Can't Hear Me"

స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

ఓహ్-సెయుంగ్ క్వాన్ దర్శకత్వం వహించిన మిడ్‌నైట్‌ అనే ఈ సినిమాలో జిన్ కీ-జూ, వై హా-జూన్, పార్క్ హూన్, గిల్ హే-యెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లయన్స్‌గేట్ ప్లేలో రిలీజ్ కానుంది. అయితే అధికారికంగా ఇంకా రిలీజ్ డేట్ గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ఇది అక్టోబర్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తోంది. కాగా సినిమా మొత్తం రాత్రి పూటనే ఉంటుంది. హీరోయిన్ కు మాటలు రాకపోవడం, చెవులు విన్పించక పోవడం వంటి లోపాలు ఉన్నప్పటికీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో సీను ఒక్కో ట్విస్ట్ తో ఉండి, సినిమా పూర్తయ్యేదాకా పక్కకు కూడా కదలనివ్వదు. ఛేజింగ్, సస్పెన్స్, ఎమోషన్ లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తల్లీ కూతురు, అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అలాగే థ్రిల్లర్ మూవీ లవర్స్ కు కూడా కావలసినంత కంటెంట్ ఉంటుంది కాబట్టి డోంట్ మిస్.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×