BigTV English

Hero Jeeva: కేవలం డబ్బులు కోసమే చేశాను, నాకు అసలు పాలిటిక్స్ కూడా తెలియదు

Hero Jeeva: కేవలం డబ్బులు కోసమే చేశాను, నాకు అసలు పాలిటిక్స్ కూడా తెలియదు

Hero Jeeva: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈరోజు చాలామందికి పరిచయం. తను నటించిన రంగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఇప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలానే శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమా కూడా జీవా కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. జీవా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు జీవా. అయితే జీవా తెలుగులో నటించిన స్ట్రెయిట్ ఫిలిం యాత్ర 2. ఈ సినిమాలో జగన్ పాత్రలో కనిపించాడు జీవా. ఈ పాత్ర గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.


యాత్ర సక్సెస్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఊహించిన విధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ తో జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయారు. అంతకుముందు ఎవరు ఊహించని విధంగా 151 యొక్క సీట్లతో గెలుపొంది సీఎంగా సక్సెస్ సాధించారు. అయితే జగన్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకొని, అప్పుడున్న కొన్ని పొలిటికల్ పరిస్థితుల వలన జగన్మోహన్ రెడ్డి బయోపిక్ యాత్ర 2 గా చేశాడు దర్శకుడు మహి వీ రాఘవ్. వాస్తవానికి మహి దర్శకత్వం వహించిన యాత్ర సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొత్తం జీవితాన్ని ఆధారంగా చేసుకోకుండా ఒక ఘట్టాన్ని మాత్రమే తీసుకొని మహి చూపించిన విధానం కొంతమందికి విపరీతంగా నచ్చింది. కమర్షియల్ గా కూడా ఆ సినిమా సక్సెస్ సాధించింది. వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన విధానం పర్ఫెక్ట్ అని చెప్పాలి.


నాకు ఏబిసిడి కూడా తెలియదు

యాత్ర సినిమా మీద అంచనాలతో యాత్ర 2 సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా అప్పటికి జగన్ ప్రభుత్వం మీద కొంత మేరకు నెగిటివిటీ ఉండటం వలన కూడా ఇది మైనస్ అయింది. ఇక ఈ సినిమాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో జీవా కనిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జీవా మాట్లాడుతూ నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏబిసిడి కూడా తెలియదు. నాకు తమిళ్ సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ ఆ సినిమాకి వచ్చింది. కేవలం డబ్బు కోసమే నేను ఆ సినిమాను ఒప్పుకొని చేశాను అని నిజాన్ని తెలిపాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : SSMB29 : జక్కన్న ప్లానింగ్ అదిరింది, ముందు మ‌హేష్ బాబు.. వెనుక డైనోసార్స్‌…

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×