BigTV English

Jennifer Lopez: విడాకులకు దరఖాస్తు చేసుకున్న మరో నటుడి భార్య!

Jennifer Lopez: విడాకులకు దరఖాస్తు చేసుకున్న మరో నటుడి భార్య!

Jennifer Lopez files for divorce from Ben Affleck: హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ విడిపోనున్నారు. హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫర్ లోపేజ్ దరఖాస్తు చేసుకుంది. దీంతో తమ రెండేళ్ల వివాహ బంధానికి బ్రేక్ పడనుంది.


లాస్ ఏంజిల్స్‌లోని కౌంటీ కోర్టులో జెన్నిఫర్ లోపేజ్ డైవర్స్ ఫైల్ చేసింది. కాగా, వీరిద్దరికీ 2002లో నిశ్చితార్థం జరిగింది. రెండేళ్లు బాగానే కలిసున్న వీళ్లిద్దరూ అనూహ్యంగా తమ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ విడిపోయారు. అనంతరం జెన్నిఫర్.. మార్క్ ఆంథొనీని పెళ్లాడింది. ఇక అఫ్లెక్…జెన్నిఫర్ గార్నర్ ను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఈ రెండు ప్రేమజంటలు 2021లో విడాకులు తీసుకున్నాయి.

విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న వీళ్లిద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారు. దీంతో 2022లో లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. కానీ రెండేళ్లు కూడా నిండకుండానే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపించాయి.


గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, రిలేషన్ సరిగ్గా లేదని సమాచారం. ఇందులో భాగంగా జెన్నిఫర్ లోఫేజ్..భారీగా భరణం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌కు చెందిన 150 మిలియన్ల డాలర్ల ఆస్తిలో సగానికి సగం వాటా కావాలని జెన్నిఫర్ డిమాండ్ చేసినట్లు వార్తల వచ్చాయి. వాస్తవానికి జెన్నిఫర్ ఆస్తి సుమారు 400 మిలియన్ల డాలర్ల పైనే ఉంటుంది.

అయితే లాస్ ఏంజిల్స్ కోర్టు ప్రకారం.. ఇద్దరూ తమ ఆర్థిక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆదాయం, ఖర్చులతోపాటు ప్రాపర్టీ, అప్పులు చెప్పాల్సి ఉంటుంది. చివరి తీర్పు వచ్చే వరకు ఇద్దరూ తమ ఆర్థిక లావాదేవీలను వెల్లడించాలని కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. 60 రోజుల్లో లోఫేజ్ తన ఆదాయ, ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉండగా.. మరో 60 రోజుల్లో అఫ్లెక్ కూడా తన ఆర్థిక వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పరిధి దాటి తర్వాత కూడ వివరాలు వెల్లడించని నేపథ్యంలో ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకుంటుంది.

Also Read: పెళ్లికి ముందు కిరణ్ అబ్బవరం ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు?

ఇదిలా ఉండగా, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మొదటి భార్య పేరు జెన్నిఫర్ గార్నర్. ఈ ఇద్దరికి ముగ్గురు సంతానం.. వయొలెట్, సెరఫినా, సామ్యూల్ ఉన్నారు. 2018లో గార్నర్‌తో బెన్ విడిపోయారు. తర్వాత లిండ్సే, షూకస్, అనడే ఆర్మస్ లతో డేటింగ్ చేశాడు. నటి, సింగర్ జెన్నిఫర్ లోఫెజ్ కూడా గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహా చేసుకుంది. తర్వాత ఏడాది ప్రారంభంలోే వీళ్లు విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్ ని పెళ్లి చేసుకున్న జెన్నిఫర్..2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. తర్వాత 2004లో మార్క్ ఆంటోనీని పెళ్లాడింది. వీరిద్దరికి 2008లో ఎమ్మీ, మాక్స్ కవలలు పుట్టారు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×