Meesaala Guruvappa: కోయారే కోయ కోయ..కోయ్ కోయ్.. కోడిని కోయ్ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఒక సువార్త సభలో మీసాల గురువప్ప అలియాస్ బ్రదర్ క్రీస్తు దాస్ అనే వ్యక్తి ఈ సాంగ్ పాడాడు. ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఎవరీ మీసాల గురువప్ప అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అంతేనా అతని జీవితంలో ఎన్నో విషాదాలు జరిగాయని చెప్పుకొచ్చారు.
మీసాల గురువప్పది ఖమ్మం జిల్లా దగ్గర ఒక ఆదివాసీ. ఆమె తల్లి దేవుడిని నమ్మిందని ఆదివాసులు చంపేశారని, ఆమెతో పాటు గురువప్ప అన్నను కూడా చంపేశారని.. ఇక చిన్నతనంలోనే తల్లిని,అన్నను పోగొట్టుకొని ఎన్నో కష్టాలు పడ్డాడట. ఆ తరువాత తల్లి అనుసరించిన మతాన్ని తీసుకొని పాస్టర్ గా మారాడని కొంతమంది చెప్తున్నారు.
ఇంకొంతమంది మాత్రం యుక్తవయస్సులో ఉన్న అతనికి తండ్రి విషం ఎక్కించి.. విషపు మనిషిగా మార్చాడని, ఆ తరువాత అతడు చనిపోయే స్టేజికి వచ్చాడని, ఆ విషాన్ని తీయడం కోసం అడివికి వెళ్లిన గురువప్పకు దేవుడు కనిపించి సందేశం ఇచ్చాడట. నిన్ను బతికిస్తా నువ్వు వెళ్లిసందేశం చెప్పు అని దేవుడే పంపాడని చెప్పుకొస్తున్నారు.
నెటిజన్స్ చెప్తున్నా స్టోరిల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. అసలు గురువప్ప ఎలాంటివాడు అనేది నీల్ రాజు అనే వ్యక్తి ఫేస్ బుక్ లో వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. అసలు అతను పాస్టర్ కాదని, అతనొక కామాంధుడు అని, ఒక మహిళపై అత్యాచారయత్నానికి కూడా పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బోరబండలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పుకొచ్చాడు.
Laila Teaser: తెల్లగా చేసుడే కాదు తోలు తీసుడు కూడా వచ్చు.. లైలా టీజర్ అదిరిపోయిందిగా
ఇక తాజాగా పాస్టర్ జాన్ మాస్కో.. గురువప్ప బండారాన్ని బయటపెట్టాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఇలాంటి పాటలు ఒరిజినల్ క్రిస్టియానిటీలో లేవు. ఎవరు అంగీకరించరు. చాలామంది డబ్బు కోసం, పేరు కోసం పాస్టర్లు అని చెప్పుకొని, ఇలాంటి పాటలను క్రియేట్ చేసి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు.
గురువప్ప గురించి నీల్ రాజు అనే వ్యక్తి ఏదైతే చెప్పాడో.. అది అక్షర సత్యం. నీల్ రాజు.. పాస్టర్లు తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు. ఎన్నోసార్లు మా మీద కూడా ఆయన ఫైర్ అయ్యాడు. అయితే ఆయన ప్రశిస్తున్నాడని, ఇలాంటి దొంగ పాస్టర్లు అందరూ కలిసి అతని ఉద్యోగం పోయేలా చేసారు. నిజమైన పాస్టర్ ఎవరైనా ఉంటే.. తప్పు చేసినా కూడా క్షమిస్తారు. అదే కదా క్రిస్టియానిటీ అంటే. దేవుడు బైబిల్ లో చెప్పింది కూడా అదే. అలాంటి ప్రశ్నించే వ్యక్తులు ఉంటేనే జాగ్రత్త ఉంటుంది. అలాంటివారు లేనప్పుడు ఇలా కోయదొరలు బయటకు వస్తున్నారు.
ట్రైబల్ పేరు చెప్పుకొని, ఇలాంటి పాటలు పాడి దేవుడిని అపహాస్యం చేస్తున్నారు. మొన్న భీమవరంలో ఒక ఈవెంట్ కు ఈయనను బుక్ చేసుకొని కామెడీ చేయించి, పూలు చల్లి శునకానందం పొందుతున్నారు. ఇలాంటివారు వలనే మా కమ్యూనిటీని ట్రోల్ చేస్తున్నారు. ముస్లిమ్స్ లో చాలామంది నెమలికలతో కొట్టి , దెయ్యాలను వదిలిస్తారు. అలాంటివారి మీద ట్రోల్స్ చేయరు. మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు.. బూతులు తిడుతున్నారు అని మేము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది.. ఇప్పుడు కోయ్ కోయ్ అని ఒక వ్యక్తి పాస్టర్ ముసుగులో ఉండి పాట పడితే ఇంత వైరల్ చేస్తున్నారు” అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.