Anil Ravipudi..’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ కొట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi).. ఈ డైరెక్టర్ సినిమాలు ఏవైనా సరే అందులో కచ్చితంగా ఫన్ ఉంటుంది. అనిల్ రావిపూడి సినిమాలు చూస్తే ఎవరికైనా సరే నవ్వు రాక తప్పదు. అలా ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. అయితే అలాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం ఆ విషయంలో హీరో వెంకటేష్ (Venkatesh) నే మించిపోయారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ అనిల్ రావిపూడి.. వెంకటేష్ ని మించిపోయేలా చేసిన ఆ పని ఏంటంటే..రెమ్యూనరేషన్.. అవును రెమ్యూనరేషన్లో అనిల్ రావుపూడి వెంకటేష్ ని మించి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..? వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంత?అనేది ఇప్పుడు చూద్దాం..
వెంకటేష్ కంటే అనిల్ రెమ్యునరేషన్ ఎక్కువ..
వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా చేశారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో వచ్చి హిట్ అయింది. సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడడానికే చాలామంది ఆడియన్స్ థియేటర్లకి వెళ్తున్నారు. అలా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో కూడా చేరింది. మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసి వెంకీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పేరు వచ్చింది. అయితే అలాంటి ఈ సినిమాకి దర్శకుడిగా చేసిన అనిల్ రావిపూడి దాదాపు రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ లెక్కన చూస్తే వెంకటేష్ కంటే అనిల్ రావిపూడి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వెంకటేష్ పారితోషికం కేవలం రూ.10 కోట్లు మాత్రమే..
ఎందుకంటే..వెంకటేష్ గత ఏడాది వచ్చిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కేవలం రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రెమ్యూనరేషన్ లో అనిల్ రావిపూడి వెంకటేష్ ని మించిపోయారని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.అలాగే సినిమా బాగుండి హిట్ అయితే మాత్రం మరో రూ. 2కోట్లు అదనంగా ఇవ్వాలని మూవీ మేకర్స్ తో అనిల్ రావిపూడి అగ్రిమెంట్ చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సక్సెస్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు అనిల్ రావిపూడి తన సినీ ప్రస్థానాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన రాజా ది గ్రేట్, ఎఫ్2, సుప్రీం, ఎఫ్3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, పటాస్, రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం..ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్సే.. అలా ఈయన దర్శకత్వం చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో ప్లాఫ్ లేని డైరెక్టర్స్ లిస్టులో అనిల్ రావిపూడి కూడా చేరిపోయారు. అలాగే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా చిరంజీవితో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.