Laila Teaser: మాస్ గా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మెకానిక్ రాఖీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా లైలా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొట్ట మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించి కనువిందు చేశాడు. ఇక టీజర్ విషయానికొస్తే కథను కొంచెం చూచాయగా చూపించినట్లు తెలుస్తోంది. “ఇట్లా కాదు అన్నా.. ఆ సోనుగాడిని లేపేద్దాం” అని ఒక గ్రూప్ మాట్లాడుకుంటుంటే విశ్వక్ ఎంట్రీని చూపించారు. సోను పాత్రలో విశ్వక్ కనిపిస్తున్నాడు.
సోను.. మేకప్ ఆర్టిస్ట్. అమ్మాయిలతో పులిహోర కలపడం, వారికి చీరలు కట్టడం, మేకప్ వేయడం.. సోను పని. దీనివలన అమ్మయిలందరూ సోనుకు పడిపోతుంటారు. దీంతో వారి భర్తలు సోనును చంపడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ గ్యాంగ్స్ తో గొడవపడుతూ సరదాగా ఉండే సోను లైఫ్ లోకి ఒక విలన్ వచ్చినట్లు చూపించారు. దీంతో సోను ఒక సమస్యలో ఇరుక్కున్నాడని, దానికోసమే లేడీ గెటప్ లో మారినట్లు టీజర్ లో చూపించారు. మరి సోను ఎందుకు లేడీ గెటప్ వేయాల్సివచ్చింది. విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా ఎందుకు నటించాల్సి వచ్చింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Child Artist Revanth: నన్ను క్షమించండి.. నాలా ఎవరు అవ్వకండి.. బుల్లిరాజు.. ఎంత చక్కగా మాట్లాడవయ్యా
ఇక లేడీ గెటప్ లో విశ్వక్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాడు. నిజంగా అతడిని చూస్తే అబ్బాయి అన్న ఫీల్ కూడా రావడం లేదని చెప్పొచ్చు. ఆ పాత్ర కోసం విశ్వక్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. టీజర్ చూసాక సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
ఇప్పటికే బాలయ్య లైలా టీజర్ చూసి సూపర్ అని మెచ్చుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.