Speech Delay In Children: పిల్లల అభివృద్ధి భిన్నంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. అదే సమయంలో, ఇంకొంతమంది పిల్లలు యాక్టీవ్ గా ఉండరు. మాట్లాడటం విషయానికి వస్తే.. కొంతమంది పిల్లలు తమ మాట్లాడే సామర్థ్యాన్ని చాలా ఆలస్యంగా అభివృద్ధి చేసుకుంటారు . దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి తల్లిదండ్రులు ఈ కారణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా వారికి సకాలంలో చికిత్స అందించవచ్చు. పిల్లలు ఎందుకు ఆలస్యంగా మాట్లాడతారు ? దీనికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెలలు నిండకుండానే జన్మించడం:
నెలలు నిండకుండానే పుట్టే ముందు పిల్లల్లో మాటలు ఆలస్యం కావడం జరుగుతుంది. పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి ఇదే ప్రధాన కారణం . అకాల జననం అంటే గర్భం దాల్చిన 9 నెలల ముందు శిశువు పుట్టడం. ఈ స్థితిలో.. పిల్లలు చాలా ఆలస్యంగా మాట్లాడతారు. వింటారు లేదా అర్థం చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితిలో.. తల్లిదండ్రులు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి తగిన చికిత్స చేయించాలి. ఎందకంటే చిన్న వయస్సులోనే కొన్ని రకాల వినికిడి, గొంతు సంబంధిత సమస్యలను ఈజీగా పరిష్కరించవచ్చు.
చెవిలో ఇన్ఫెక్షన్:
మీ పిల్లలు ఆలస్యంగా మాట్లాడుతుంటే.. దానికి చెవి ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు. కొంతమంది పిల్లలకు పాలు తాగడం వల్ల పుట్టినప్పుడు లేదా తర్వాత చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాంటి సందర్భాలలో వారి మాట్లాడే సామర్థ్యం ప్రభావితమవుతుంది. మీ బిడ్డ ఆలస్యంగా మాట్లాడుతుంటే.. తప్పకుండా ఒకసారి పిల్లల నిపుణుడి సలహా తీసుకోండి.
సరిగ్గా వినడంలో ఇబ్బంది:
పిల్లు కొన్ని సార్లు మనం చెప్పిన విషయాలను అస్సలు అర్థం చేసుకోలేరు. అలాంటి పరిస్థితిలో వారి మాట్లాడే సామర్థ్యం ప్రభావితమవుతుంది. అంతే కాకుండా వినికిడి లేదా అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటే, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించండి. తద్వారా వారి సమస్యలు మరింత పెరగకుండా ఉంటాయి.
నాడీ సంబంధిత సమస్య:
పిల్లలకి ఏదైనా నాడీ సంబంధిత సమస్యలు ఉంటే.. అప్పుడు అతను మాట్లాడటంలో ఇబ్బంది పడవచ్చు. మీ బిడ్డ సరైన వయస్సులో మాట్లాడకపోతే.. ఖచ్చితంగా ఒకసారి మీ పిల్లల వైద్యుడిని సంప్రదించండి. తద్వారా వారు తక్కువగా మాట్లాడటం లేదా ఆలస్యంగా మాట్లాడటం వెనుక ఉన్న కారణాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు.
Also Read: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
ఆటిజం :
పిల్లలు తక్కువగా మాట్లాడటానికి లేదా ఆలస్యంగా మాట్లాడటానికి ఆటిజం కూడా కారణం కావచ్చు. ఈ కారణంగా పిల్లవాడు చాలా తక్కువగా లేదా ఆలస్యంగా మాట్లాడతాడు. ఇది ఒక మానసిక రుగ్మత. దీనిలో పిల్లలు భాషను అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. మీ బిడ్డ ఆలస్యంగా మాట్లాడుతుంటే లేదా తక్కువగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా పిల్లల నిపుణుడి సహాయం తీసుకోండి.
కొంతమంది పిల్లలు చాలా ఆలస్యంగా మాట్లాడతారు. దీని వెనుక ఉన్న కారణం సాధారణమైనది లేదా తీవ్రమైనది కావచ్చు. అటువంటి పరిస్థితిలో, అసలు కారణాన్ని తెలుసుకోవడానికి మీరు ఒకసారి డాక్టర్ సహాయం తీసుకోవాలి. తద్వారా ఆలస్యంగా మాట్లాడటానికి కారణాన్ని మనం అర్థం చేసుకోగలం.