BigTV English

Female Team Owners: RCBకి ఈ లేడీ ఓనర్స్ టెన్షన్.. ఇదే జరిగితే పంజాబ్ ఛాంపియన్ కానుందా

Female Team Owners: RCBకి ఈ లేడీ ఓనర్స్ టెన్షన్.. ఇదే జరిగితే పంజాబ్ ఛాంపియన్ కానుందా

Female Team Owners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే.. పంజాబ్ కింగ్స్ తల పడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇవాళ రాత్రి… 7:30 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ… నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కొత్త టెన్షన్ మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు లేడీ ఓనర్ల భయం పట్టుకుంది. ఆడాళ్ళ చేతిలో మసి కావాల్సిందే అని.. సోషల్ మీడియాలో బెంగళూరులో ట్రోలింగ్ చేస్తున్నారు. గత రికార్డులు పరిశీలిస్తే.. లేడి ఓనర్లు ఉన్న జట్లను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఫైనల్స్ లో ఓడించలేకపోయింది.


Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ

డెక్కన్ చార్జెస్ చేతిలో దారుణంగా ఓటమి


డెక్కన్ చార్జెస్ 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అది కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన ఫైనల్ లో డెక్కన్ చార్జెస్ విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. డెక్కన్ చార్జెస్ ఓనర్ గాయత్రి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. గాయత్రి రెడ్డి ఓనర్ గా ఉన్న డెక్కన్ చార్జెస్… 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ లో ఆరు పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ఉచిత చేసింది. ఈ మ్యాచ్ లో గిల్లి డెక్కన్ చార్జెస్ కెప్టెన్ గా ఉండగా.. అనిల్ కుంబ్లె బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించారు.

కావ్యా పాప చేతిలో మట్టి కరిచిన బెంగళూరు

2016 సంవత్సరంలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది. అప్పుడు హైదరాబాద్ చేతిలో దారుణంగా ఓడిపోయింది బెంగళూరు. ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు… జోరుగా తలపడి… సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 8 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్గా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే డెక్కన్ చార్జెస్ తరహాలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కూడా లేడీ కావడం విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ అన్న సంగతి తెలిసిందే. అంటే రెండుసార్లు ఫైనల్ కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… లేడీ ఓనర్ల చేతిలో చిత్తయింది.

ఇవాళ ప్రీతి జింటా టీం తో బెంగళూరు ఫైనల్

ఇవాళ ప్రీతి జింటా ఓనర్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్రీతి జింటా లేడి ఓనర్ కాబట్టి.. ఇవాల్టి ఫైనల్ లో కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు ఓడిపోతుందని సోషల్ మీడియాలో కొత్త మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బెంగళూరు జట్టుకు.. మళ్లీ నిరాశ ఎదురవుతుంది. 18 సంవత్సరాలుగా టైటిల్ కొట్టాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్న నేపథ్యంలో.. లేడీ బాస్ టెన్షన్ మొదలైంది.

Related News

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

Big Stories

×