Hari Hara Veera Mallu: ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హీరోగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ ఇప్పుడు అభిమానులలో సినిమాపై ఊహించని హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం(AM Ratnam) ఈ సినిమా గురించి చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఒక వర్గం అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశకు గురిచేస్తుందని చెప్పవచ్చు. మరి నిర్మాత ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నర్గీస్ ఫక్రి పాత్ర పై నిర్మాత కామెంట్..
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడిక్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis fakri) మొఘల్ యువరాణి రోషనారా బేగం పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఎక్కడా కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. అయితే ఈమె ఈ సినిమాలో ఉంటుందా ఉండదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా నిర్మాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నర్గీస్ ఫక్రీ పాత్ర పై ఊహించని కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “హిందీ నటి నర్గీస్ ఫక్రీ పార్ట్ వన్ లో కనిపించదు. నర్గీస్ పాత్ర రెండవ భాగంలో ఉంటుంది” అంటూ తెలిపారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. బాబి డియోల్, నాజర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్ జీత్ విర్క్, నోరా పతేహీ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి అయితే మొదటి భాగంలో నర్గీస్ ఫక్రీ హీరోయిన్గా నటించదు అని తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి రెండవ భాగంలోనైనా ఆమె తన పాత్రతో ఆకట్టుకుంటుందేమో చూడాలి.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
సినిమా విషయానికి వస్తే.. హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యానికి వ్యతిరేకంగా నిర్మించబడింది. సాంకేతిక బృందంలో సినిమా ఆటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోటా భరణి కూడా పనిచేస్తున్నారు. ఇక ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో 2021 లోనే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా ఆగిపోయింది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయారు. క్రిష్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక రంగంలోకి దిగిన జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇకపోతే నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కాబోతోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Star Heroine: పిచ్చి పీక్స్ భయ్యా.. హీరోయిన్స్‌కి గుడిలే కాదు.. ఊరు పేర్లు కూడా పెడుతున్నారు!