NTR – Rajinikanth : ఇదివరకు స్టార్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడడం అనేది భాష వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వార్ కు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ – రజనీకాంత్ మధ్య ఈ వార్ ముదురుతోంది. ఇద్దరి మధ్య వైరం కొనసాగుతుందా ? అన్నట్టుగా పోటాపోటీగా సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ క్లాష్ ఏఏ సినిమాల మధ్య జరగబోతోంది? ఎందుకు తారక్ – రజనీకాంత్ సినిమాలను పోటీ పోటీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే…
‘కూలీ’తో మొదలైన క్లాష్
సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ ‘కూలీ’ (Coolie). ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా… అది కూడా రజనీకాంత్ హీరో కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ‘కూలీ’ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.
కానీ అంతకంటే ముందే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ హిందీ మూవీ ‘వార్ 2’ (War 2) మూవీని ఇదే రిలీజ్ డేట్ కి థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై మల్టీస్టారర్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆల్రెడీ ‘వార్ 2’ మూవీ మేకర్స్ ఆగస్టు 14 డేట్ పై కర్చీఫ్ వెయ్యగా, ‘కూలీ’ నిర్మాతలు కూడా అదే డేట్ కు థియేటర్లలోకి రాబోతున్నామని అనౌన్స్ చేయడంతో అఫీషియల్ గా బాక్స్ ఆఫీసు వార్ ను అనౌన్స్ చేసినట్టుగా అయింది. ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అనుకుంటే ఆ తర్వాత రజనీకాంత్ నెక్స్ట్ మూవీని కూడా ఎన్టీఆర్ కు పోటీగా మేకర్స్ దింపబోతున్నారని టాక్ నడుస్తోంది.
రెండేళ్లలో రెండుసార్లు తారక్ వర్సెస్ తలైవా
2025 ఆగస్టు 14న ‘వార్ 2’, ‘కూలీ’ సినిమాల మధ్య డేట్ టు డేట్ క్లాష్ అన్నది కన్ఫర్మ్ అయింది. అయితే ‘వార్ 2’ మూవీ వాయిదా పడబోతోంది అన్న రూమర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే 2026లో మరోసారి ఇద్దరు స్టార్ హీరోల మధ్య బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ జరగబోతుందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ – నీల్ సినిమాను 2026 ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.
ఇక రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘జైలర్ 2’ను కూడా అదే డేట్ కి రంగంలోకి దించుతారని అంటున్నారు. ఒకవేళ డేట్ టు డేట్ క్లాష్ గనక జరగకపోతే, ఒక వారం గ్యాప్ తో ఈ మూవీని రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో “ఇదెక్కడి గొడవ రా బాౠ… ఎన్టీఆర్ తో రజనీకాంత్ కి ఏమన్నా వైరముందా? ఎందుకిలా ఆయన సినిమాల రిలీజ్ డేట్లనే టార్గెట్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి తారక్ వర్సెస్ తలైవా పోటీలో గెలిచేది ఎవరో చూడాలి.
Read Also : బిగ్ స్క్రీన్ పై బ్యాన్ అయిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీస్… ఇండియాలో ఏ ఓటిటిలో చూడొచ్చంటే?