BigTV English

Almond: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? పొరపాటున కూడా అలా చేయొద్దు !

Almond: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? పొరపాటున కూడా అలా చేయొద్దు !

Almond: వ్యాధుల బారి నుండి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని చెబుతుంటారు. బాదం కూడా ప్రతి ఒక్కరూ తినాల్సిన డ్రై ఫ్రూట్ అని చెప్పొచ్చు. అందుకే హల్వా నుండి లడ్డూ వరకు చాలా రకాల స్వీట్ తయారీలో వీటిని ఉపయోగిస్తారు.


కొంతమంది నానబెట్టిన బాదం ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఒక రోజులో ఎన్ని బాదం తినాలి ? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. బాదం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాదంతో బోలెడు ప్రయోజనాలు:


బాదంలో అనేక గుణాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం ,రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్ళు, గుండె, చర్మం, మెదడుకు మేలు జరుగుతుంది. కానీ బాదం ఎక్కువగా తినడం వల్ల చాలా అనేక నష్టాలు ఉంటాయి.

బాదం ఎక్కువగా తినడం ప్రమాదకరం :
బాదం పప్పును పరిమిత పరిమాణంలో తినడం వల్ల లాభాలున్నా అధికంగా తింటే కూడా అంతే నష్టాలు ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది:
బాదంపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. మీరు బాదం పప్పును ఎక్కువగా తింటే.. గ్యాస్, తిమ్మిరి లేదా మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

అలెర్జీలు:
కొంతమందికి బాదం ఎక్కువగా తినడం వల్ల దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అనాఫిలాక్టిక్ షాక్ వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు బాదం పెదవులు, నాలుక వాపుకు కూడా కారణమవుతుంది.

మూత్రపిండాలకు నష్టం:
బాదంపప్పులో ఆక్సలేట్లు అనే మూలకం అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇప్పటికే మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే బాదం తినాలి.

బరువు వేగంగా పెరుగుతుంది:
బాదం ఎక్కువగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి.. బాదం పప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరగుతారు. 10 బాదం పప్పులలో 69 నుండి 74 కేలరీలు ఉంటాయి. అందుకే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి.

Also Read: ఈ టీ తాగితే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

ఒక రోజులో ఇన్ని బాదంపప్పులు తినాలి ?
మీరు ఒక రోజులో ఎన్ని బాదం తినాలి అనేది మీ అవసరాలు , వయస్సుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతిరోజూ తమ ఆహారంలో 5 నుండి 6 బాదంపప్పులను మాత్రమే తినాలి. జిమ్‌కు వెళ్లే వారు బరువు పెరగాలని అనుకునే వారు రోజుకు 10 నుండి 23 బాదంపప్పులు కూడా తినవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా రోజుకు 5 నుండి 6 బాదంపప్పులు మాత్రమే తినాలి.

పెరుగుతున్న పిల్లలు అంటే 9 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు దాదాపు 10 బాదంపప్పులను తినడం మంచిది. ఇది పిల్లల మెరుగైన అభివృద్ధికి సహాయపడుతుంది. బాదంపప్పును ఎల్లప్పుడూ నానబెట్టి తినాలని గుర్తుంచుకోండి. ఇది దాని లక్షణాలను పెంచుతుంది. ఉదయం పూట నానబెట్టిన బాదం తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Related News

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Signs of Kidney Damage: ఉదయం పూట ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? మీ కిడ్నీలు పాడైనట్లే !

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

Big Stories

×