BigTV English

Ram Charan : ఫ్యాన్స్ కోసం భోజనం… ప్రభాస్ ఫ్రెండ్ కదా… ఆ మాత్రం ఉంటుందిలే

Ram Charan : ఫ్యాన్స్ కోసం భోజనం…  ప్రభాస్ ఫ్రెండ్ కదా… ఆ మాత్రం ఉంటుందిలే

Ramcharan : శుక్రవారం విడుదలైన “గేమ్ ఛేంజర్” మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక అభిమాన హీరోను కలిసి తమ ఆనందాన్ని పంచుకోటానికి నేరుగా చరణ్ నివాసానికి వెళ్లారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ ను ఎంతో ఆప్యాయంగా పలకరించిన చరణ్.. వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద మనసుకు చాటుకున్నారు.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా హిట్ తో మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ముందే వచ్చేసిందని చెప్పాలి. ఇక తమ ఆనందాన్ని పంచుకోటానికి అభిమానులంతా హైదరాబాద్ లో ఉన్న చరణ్ ఇంటికి వచ్చేశారు. ఫ్యాన్స్ కు కాసేపు మాట్లాడిన చరణ్.. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో అభిమానులు ఈ ఊహించని సర్ప్రైజ్ కు షాక్ అయ్యారు. తమ అభిమాన నటుడి పెద్ద మనసుకు ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా మా చరణ్ అన్న గ్రేట్ అంటూ ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

హీరో ప్రభాస్ సైతం తన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తాడు. భోజన మర్యాద విషయంలో ఎప్పుడూ ముందుండే ప్రభాస్.. ఇప్పటికే ఎన్నోసార్లు తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ సక్సెస్ నేపథ్యంలో రామ్ చరణ్ సైతం ఫ్యాన్స్ కు భోజనాలను ఏర్పాటు చేయటంతో ఎంతైనా ప్రభాస్ ఫ్రెండ్ కదా… వాళ్లతో ఇలానే ఉంటుందని, మర్యాదలకు ఏం లోటు ఉండదని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.


ఇక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన “గేమ్ ఛేంజర్”లో రామ్ చరణ్ పవర్ఫుల్ ఐఏఎస్ పాత్రలో కనిపించారు. ఇందులో చరణ్ మూడు లుక్స్ లో కనిపించి అదరగొట్టేశాడు. కాలేజ్ లో యంగ్ లుక్ లో సందడి చేసిన చరణ్.. IAS అధికారిగా, తండ్రి పాత్రలో అప్పన్నగా కనిపించారు. ఇందులో అప్పన్న పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

సినిమా హిట్ తో మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన సైతం సోషల్ మీడియాలో చరణ్ తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలకు చరణ్‌కు వస్తున్న ప్రశంసలకు ఎంతో సంతోషంగా ఉందని… ఎస్‌.జె. సూర్య, దర్శకుడు శంకర్‌, కియారా అడ్వాణీ, అంజలి, నిర్మాత దిల్‌ రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి తెలిపారు. ఇక ‘‘కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌. ప్రతీ విషయంలోనూ నువ్వు నిజంగానే ఒక గేమ్‌ ఛేంజర్‌. లవ్‌ యూ..’’ అంటూ ఉపాసన పోస్ట్‌ చేశారు.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. మెుదటి రోజు ఈ చిత్రం రూ.186 కోట్లు వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో తొలి రోజు 1.3 మిలియన్ టికెట్లు అమ్మడైనట్టు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మించారు. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. తమన్‌ సంగీతాన్ని అందించారు.

ALSO READ : పెళ్లి తరువాత కజిన్స్ తో అక్కినేని పెద్ద కోడలు.. అతనెక్కడ.. ?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×