BigTV English

NTR-Sukumar: సుకుమార్‌తో ఎన్టీఆర్.. పార్టీనా? సినిమానా? తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

NTR-Sukumar: సుకుమార్‌తో ఎన్టీఆర్.. పార్టీనా? సినిమానా? తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

NTR-Sukumar: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో.. గతంలో “నాన్నకు ప్రేమతో” (Nannaku Prematho) అనే సినిమా వచ్చింది. 2016లో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. తారక్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు సుకుమార్. ఈ సినిమా విమర్శకుల నుండి మంచి స్పందన పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. అయితే.. అభిమానులు మాత్రం ఈ ఇద్దరి నుంచి ఊర మాస్ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేశారు. “నాన్నకు ప్రేమతో” యాక్షన్ డ్రామా చిత్రమే కానీ, అభిమానులు ఫుల్లుగా సాటిస్ఫై అవలేదు. దీంతో.. ఇద్దరు ఎప్పటికైన మళ్లీ ఒక మాస్ సినిమా చేయకపోతారా? అని ఎదురు చూస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఇద్దరి కమిట్మెంట్స్ చూస్తే.. ఇప్పట్లో ఈ కాంబో వర్కౌట్ అయ్యేలా లేదు. కానీ ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేయడంతో.. ఫ్యాన్స్‌ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అసలు ఇద్దరు ఎందుకు కలిశారు? అనే చర్చ సోషల్ మీడియాలో వాడివేడిగా జరుగుతోంది.


ఒక్క ఫోటోతో సోషల్ మీడియా షేక్

లేటెస్ట్‌గా సుకుమార్ భార్య తబిత (thabitha sukumar) ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఎన్టీఆర్ మరియు సుకుమార్ కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. ఇందులో సుకుమార్ భుజాలపై వాలి ఉన్నాడు తారక్. ఈ ఫోటోకి “తారక్‌కి ప్రేమతో” అని క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌ని ఎన్టీఆర్ రీపోస్ట్ చేస్తూ “నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్” అని.. నాన్నకు ప్రేమతో సినిమాలోని డైలాగ్‌ని రాసి సుకుమార్‌కు ట్యాగ్ చేశాడు. ఇదే పోస్ట్‌ని మళ్లీ సుకుమార్ రీ పోస్ట్ చేసి ‘మై అభిరామ్’ అని రాసుకొచ్చాడు. మొత్తంగా.. ఈ ఒక్క ఫోటోని ముగ్గురు షేర్ చేయడంతో.. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ ఫోటో నందమూరి అభిమానుల్లో ఎన్నో అనుమానాలకు దారి తీసింది. ఈ ఇద్దరు ఉన్నట్టుంటి ఎందుకు కలిశారు? ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి? అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ ఇద్దరు అనుకోని కలవలేదని, అనుకోకుండా కలిసినట్టుగా ఇండస్ట్రి వర్గాల సమాచారం. అసలు ఇద్దరు ఎందుకు? ఎక్కడ? కలిశారు?


అందుకే కలిశారా?

సుకుమార్‌, ఎన్టీఆర్ కలిసింది నిజమే.. ఫోటోని షేర్ చేసింది నిజమే.. కాకపోతే ఈ ఇద్ద‌రూ ఓ ప్రైవేట్ పార్టీలో క‌లిసినట్టుగా సమాచారం. రీసెంట్‌గా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరితో సుకుమార్‌తో సూపర్ బాండింగ్ ఉంది. దీంతో.. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఈ ఇద్దరు వచ్చి ఉండొచ్చు, అక్కడే కలిసి ఉండొచ్చు, ఆ సమయంలో తీసిన ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసి ఉండొచ్చు.. అని అంటున్నారు. అంతకుమించి ప్రస్తుతానికి ఈ ఇద్దరు సినిమాలు చేసే ఛాన్స్ అయితే లేదు. ఫ్యూచర్‌లో ఉంటే ఉండొచ్చు కానీ, ఇప్పట్లో సాధ్యమయ్యే పనైతే కాదు. ప్రస్తుతం, సుకుమార్ రామ్ చరణ్‌తో ఆర్సీ 17 (RC 17) ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత పుష్ప3 (Pushpa3) చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ వచ్చేసి వార్ 2 (War 2), దేవర 2 (Deavara 2), ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాలు కమిట్ అయ్యాడు. కాబట్టి, ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×