CM Revanth Reddy : సీఎం రేవంత్ క్లియర్ కట్‌గా చెబుతున్నారు. నన్ను నమ్మండి.. నేనున్నా.. అంటూ అభయం ఇస్తున్నారు. అయినా, కొందరు ఎమ్మెల్యేలకు ఓపిక ఉండట్లేదు. మంత్రి పదవి కావాలంటూ.. ఇంకా రాలేదంటూ నానారచ్చ చేస్తున్నారు. మైక్ దొరికిన ప్రతీసారీ పబ్లిక్‌గా నోరు జారుతున్నారు. అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని.. సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పేశారు. పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయని అన్నారు. అందుకు, అద్దంకి దయాకర్ ఉదంతమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని గుర్తు చేశారు. అద్దంకిని ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చానని.. చెప్పినట్టే ఛాన్స్ రాగానే MLC ని చేశానని రేవంత్ చెప్పారు.
ఆ ఎమ్మెల్యేలకు పొగరు!
పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేకు పొగరు పెరిగిందంటూ హాట్ కామెంట్స్ కూడా చేశారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో ఉంటున్నారని తప్పుబట్టారు. సీఎల్పీ మీటింగ్‌లో చెప్పినా ఆ ఎమ్మెల్యేల పనితీరు మారలేదని మండిపడ్డారు.
MLA అయ్యాక మనోడు.. మందోడు అంటూ ఉండదని.. అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదని.. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
గ్రౌండింగ్‌పై ఫోకస్
రేవంత్ చెప్పింది చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తానని తెలిపారు సీఎం. ఏడాదిన్నర పథకాల ప్లానింగ్‌కే సరిపోయిందన్నారు. ఇకపై పథకాల గ్రౌండింగ్‌పై ఫోకస్ పెడతానన్నారు. KCR మాదిరి లాంచింగ్, క్లోజింగ్ పథకాలు తాను చేయనని.. ఓ పథకం ప్రారంభిస్తే.. అర్హులకు అందే వరకు పనిచేస్తానన్నారు.
పస లేని.. పిల్లగాళ్లు ఎందుకు?
ఇక, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో KCR ఇచ్చిన స్పీచ్‌లో పస లేదన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని.. తన అక్కసు మొత్తం కక్కాడన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కారణం కేసీఆర్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులను పిల్లగాళ్లు అని అన్నాడని.. మరి వారినెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుంచి పథకాలు తీసుకొచ్చాం.. ఇప్పుడు వాటంన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లు ఏ రాష్ట్రంలో అమలులో లేవన్నారు.
Also Read : స్మితా సభర్వాల్‌కు రేవంత్ సర్కార్ షాక్
రాహుల్‌తో మంచి రిలేషన్
ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరన్నారు సీఎం రేవంత్. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే అన్నారు. KCR, మోడీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని మండడిపడ్డారు. తనకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని.. తాను ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదన్నారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. కగార్‌పై పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.