Jyotika : సీనియర్ హీరోయిన్ జ్యోతిక (Jyotika) ఇప్పుడు తన కొత్త నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ (Dabba Ccartel)ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఆన్‌లైన్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ కొత్త చర్చకు దారి తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమె భర్త సూర్య (Suriya) కంటే ప్రదీప్ రంగనాథన్ లేదా విజయ్ చాలా బెటర్ అని ఆమెను ట్రోల్ చేశాడు. ఆ కామెంట్ కాస్తా జ్యోతిక దృష్టిలో పడడంతో ఆమె స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. జ్యోతిక భర్తపై ట్రోలింగ్ గురించి ఎలా స్పందించింది అనే వివరాల్లోకి వెళ్తే…
ట్రోల్ కి స్పందించిన జ్యోతిక
జ్యోతిక ఇటీవల చేసిన ఓ పోస్ట్ కి నెటిజన్ల నుంచి వచ్చిన కామెంట్స్ తో ఆమె కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. అందులో కొంతమంది సూర్యను ట్రోల్ చేశారు. “ప్రదీప్ రంగనాథన్ మీ భర్త సూర్య కంటే బెటర్, నిజం ఏమిటంటే విజయ్ మీ భర్త, ఆమె సోదరుడి కంటే బెటర్, మొదట డ్రాగన్, లవ్ టుడే కలెక్షన్స్ ను బ్రేక్ చేయమని చెప్పండి” వంటి కామెంట్స్ చేశారు కొంతమంది. ఈ కామెంట్స్ సారాంశం ఏమిటంటే… విజయ్ సూర్య కంటే బెటర్ అని. అలాంటి కామెంట్స్ పై జ్యోతిక స్పందించిన తీరు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆమె నవ్వుతున్న ఎమోజీతో కూల్ గా రిప్లై ఇచ్చింది.
దీంతో జ్యోతిక రిప్లై చూసిన ఆమె అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అనవసరంగా ఇలాంటి ఫ్యాన్ వార్ లోకి జ్యోతికను ఎందుకు లాగుతున్నారు? అని ఫైర్ అవుతుంటే, మరికొంత మంది మాత్రం అసలు ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ పై స్పందించకపోతేనే బెటర్ అని ఆమెకు సలహా ఇస్తున్నారు.
బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు
జ్యోతిక చివరిసారిగా 2024లో వచ్చిన ‘షైతాన్ ‘, ‘శ్రీకాంత్’ చిత్రాలలో కనిపించింది. ఇటీవల కాలంలో జ్యోతిక వరుస హిందీ ఆఫర్లు కొట్టేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. ఫిబ్రవరి 28న విడుదల కానున్న ‘డబ్బా కార్టెల్’ అనే సిరీస్ తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలోనే ఆమె బిజీగా ఉంఉంది. అలాగే జ్యోతిక హింద్-తమిళ బైలింగ్వల్ చిత్రం ‘లయన్’లో కూడా నటించింది.
‘కంగువ’తో సూర్యకు పెద్ద దెబ్బ
సూర్య 2024లో వచ్చిన ‘కంగువ’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. పైగా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. 2024 లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ డిజాస్టర్ కారణంగా సూర్యపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. కానీ ఆయన మాత్రం ‘కంగువ’ రిజల్ట్ ను పక్కన పెట్టి, ఇప్పుడు ‘రెట్రో’ అనే కొత్త మూవీపై ఫోకస్ పెట్టారు. ఆ తరువాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.