Shobhita dhulipala.. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన మొన్నటివరకు సరైన సక్సెస్ కోసం ఎంతగా ఎదురు చూశారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఎట్టకేలకు చందు మొండేటి(Chandu mondeti) దర్శకత్వంలో ఫిబ్రవరి 7వ తేదీన తండేల్ (Thandel) అనే రియల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నాగచైతన్యకు మంచి విజయాన్ని అందించింది. ముఖ్యంగా శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) ను వివాహం చేసుకున్న తర్వాత నాగచైతన్య నటించిన సినిమా కావడంతో ఆమె వల్లే ఇదంతా సాధ్యమైందని , నాగచైతన్యకు భార్యగా శోభిత అడుగుపెట్టిన తర్వాత నాగచైతన్యకి మహర్దశ ప్రారంభం అయ్యింది అని అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
ఇక ఇలాంటి సమయంలో అక్కినేని నాగచైతన్యాలో దాగివున్న ఒక టాలెంట్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో నాగచైతన్యతో పెళ్లి తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలను, అలాగే వారు వెకేషన్స్ కి వెళ్ళిన ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది శోభిత. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక పిక్ ను కూడా తన ఇన్స్టా లో షేర్ చేసి అబ్బురపరిచింది. అందులో నాగచైతన్య డీజే ప్లే చేస్తున్న ఫోటోని శోభిత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ఇందులో చైతూ స్వెటర్ వేసుకొని, డీజే ప్లే చేస్తూ మనకు కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ చైతూలో ఇంత టాలెంట్ ఉందా? ఎప్పుడు బయటపడలేదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అభిమానులు కూడా తమ హీరోలో దాగి ఉన్న ఈ టాలెంట్ కి తెగ సంబరపడిపోతున్నారు.. మొత్తానికైతే శోభిత షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
నాగచైతన్య – శోభితల ప్రేమాయణం, పెళ్లి..
నాగచైతన్య – సమంత(Samantha) ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి సమంతాను వివాహం చేసుకున్నారు నాగచైతన్య. అయితే వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత శోభిత ప్రేమలో పడ్డారు నాగచైతన్య. వీరిద్దరూ లండన్ లో ఒక హోటల్లో కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ ని మీరు కొట్టి పడేసారు. అలా రెండు సంవత్సరాలు రహస్యంగా డేటింగ్ చేసిన వీరు ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం తండెల్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నాగచైతన్యకు మంచి గుర్తింపును అందించింది.