Kajal Agarwal Joining in Manchu Vishnu’s Kannappa Movie: ఉన్నాకొద్దీ కన్నప్ప సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అసలు మంచు విష్ణు సినిమా అంటే హైప్ చేయాల్సిన అవసరం లేదు.. అలాంటిది ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచి హైప్ ఓ రేంజ్ లో పెంచేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఇక టాలీవుడ్ మొత్తం మీద హయ్యెస్ట్ కాస్టింగ్ ఉన్న సినిమాగా కన్నప్ప రికార్డ్ సృష్టించింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా ఎన్ని వుడ్స్ అయితే ఉన్నాయో అందులో స్టార్స్ గా వెలుగొందుతున్న హీరోలను కన్నప్పలో పెట్టేశాడు విష్ణు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివన్న, శరత్ కుమార్.. ఇలా దిగ్గజ నటులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరందరితో ఆగకుండా విష్ణు.. ఇంకా స్టార్స్ ను దింపుతూనే ఉన్నాడు.
తాజాగా కన్నప్పలోకి మరో స్టార్ హీరోయిన్ దిగింది. ఆమె చందమామ కాజల్ అగర్వాల్. ఒక కీలక పాత్రలో కాజల్ నటిస్తుందని కన్నప్ప మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మంచు విష్ణు- కాజల్ కాంబోలో ఇప్పటికే మోసగాళ్లు అనే సినిమా వచ్చింది. ఇందులో వీరిద్దరూ అన్నాచెల్లెలుగా కనిపించారు. ఇక ఆ స్నేహంతోనే కాజల్ అడగగానే ఒప్పుకుంది అని టాక్ నడుస్తోంది. త్వరలోనే కాజల్ సెట్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
Also Read: Naga Babu Twitter Account: మళ్లీ ట్విట్టర్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఈ సారి ఏమని ట్వీట్ చేశారంటే..?
కాజల్ రీఎంట్రీ తరువాత కథలను చాలా సెలెక్టీవ్ గా ఎంచుకుంటుంది. ఇప్పటికే కాజల్.. సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనటిస్తోంది . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలతో కాజల్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.