AP Govt. forms SIT on Post Elections Violence: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన పలు హింసాత్మక సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి అయిన ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ పని చేయనున్నది.
సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి. శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్ స్పెక్టర్లు భూషణం, కె. వెంకట్ రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్. ప్రభాకర్ రావు, శివప్రసాద్ ఉన్నారు. సీఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ విచారణ జరపనున్నది. రెండురోజుల్లో ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనున్నది.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం తాడిపత్రి, పల్నాడు, నరసరావుపేట, మాచర్ల, చంద్రగిరి, తిరుపతిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలపై సిట్ విచారణ జరపనున్నది. ఈ సంఘటనలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటి..? వాటిని ఎవరు ప్రోత్సహించారు..? అలర్లు హింసాత్మకంగా మారడానికి కారకులు ఎవరు..? ఇలా మొత్తంగా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనున్నది. అదేవిధంగా విశాఖలో కూడా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనపై కూడా విచారణ జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఓ నివేదికను తయారు చేసి, ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనున్నది.
Also Read: SIT primary inquiry on five areas: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?
అయితే, ఏపీలో చోటు చేసుకున్న ఈ హింసాత్మక సంఘటనలపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదికను పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన అనంతరం రెండు రోజుల్లో సిట్ నివేదికను ఈసీకి పంపనున్నది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనున్నది. హింసాత్మక ఘటనలకు కారణమైనవారిని అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశంలేకపోలేదని తెలుస్తోంది.
కాగా, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కూడా ఢిల్లీకి పిలిచి ఏపీలో చోటు చేసుకున్న అల్లర్లపై వివరణ కోరింది. అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేసింది.
Also Read: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!
అయితే, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతమున్న బలగాలతోపాటు అదనపు బలగాలు ఏపీకి చేరుకున్నాయి. ఎక్కడైతే హింసాత్మక సంఘటనలను చోటు చేసుకున్నాయో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను గృహనిర్భందం చేశారు. వారి ఇళ్ల వద్ద పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.