BigTV English

Jay Shah on Hardik Pandya Selection: హార్దిక్ పాండ్యాను అందుకే తీసుకున్నాం: జై షా క్లారిటీ!

Jay Shah on Hardik Pandya Selection: హార్దిక్ పాండ్యాను అందుకే తీసుకున్నాం: జై షా క్లారిటీ!

Jay Shah Says Reasons for Hardik Pandya’s Selection in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లోకి ఆల్ రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యాను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. చాలామంది చాలారకాలుగా మాట్లాడుతుంటారు. నిజానికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎలా ఆలోచించిందంటే టీ 20 ప్రపంచకప్ విదేశీపిచ్ లపై జరుగుతోంది. అందుకే అక్కడ రాణించిన వారికి పెద్ద పీట వేశారని తెలిపారు.


ఐపీఎల్ లో ప్రదర్శన ఒక్కదాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. కుర్రాళ్లను మాత్రమే తీసుకువెళితే, వారికి విదేశీ వాతావరణం, అక్కడ పిచ్ లు అలవాటయ్యేసరికి టీ 20 వరల్డ్ కప్ ముగిసిపోతుందని అన్నారు. వారికి అనుభవం మాత్రమే వస్తుందని తెలిపారు.

అనుభవం కోసమైతే ఇతర దేశాల జట్లతో సిరీస్ లు జరుగుతుంటాయి. అప్పుడు తీసుకువెళుతుంటాం. కానీ ఇప్పుడు జరిగేది ఐసీసీ ప్రపంచకప్…అందుకని అనుభవం ఉన్నవాళ్లు కావాలి, వారికి తోడుగా యువకులు కావాలి. అందుకనే జట్టుని సమపాళ్లలో ఉండేలా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని తెలిపారు.


Also Read: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో.. ఎవరున్నారు?

అందులో భాగంగానే హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇక బీసీసీఐ కార్యదర్శిగా నా పాత్ర కేవలం సమాచారం ఇవ్వడం వరకే పరిమితమని తెలిపారు. జట్టు ఎంపికలో నా ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. అక్కడ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ కలిసి నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు. కాకపోతే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు, ఈ వివరణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇది మాత్రం నా బాధ్యతని తెలిపాడు.

ఒక్క ఐపీఎల్ లో విఫలమైనంత మాత్రానా పాండ్యా చిత్తశుద్ధిని, ఆటపై అంకితభావాన్ని, గెలుపు కోసం పడే తపనను ఎవరూ తప్పు పట్టలేరని నెటిజన్లు పేర్కొంటున్నారు. టీ 20 ప్రపంచకప్ టీమ్ ను ఎంపిక చేసిన కొద్దిరోజులకి సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Also Read: RCB vs CSK Match Preview : ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?

హార్దిక్ పై వచ్చిన ప్రశ్నలకు అగార్కర్ సమాధానమిస్తూ పేస్ ఆల్ రౌండర్ విభాగంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో పాండ్యాను ఎంపిక చేయక తప్పలేదని అన్నాడు. శివమ్ దుబె కూడా జట్టులో ఉన్నాడు. కానీ తనకి విదేశాల్లో అనుభవం లేదని తెలిపాడు. ఇక ఐపీఎల్ లో పాండ్యా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అందువల్ల ప్రపంచకప్ ఫైనల్ జట్టులో ఎక్కువ మ్యాచ్ లు ఆడించే అవకాశం ఉండదని అంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×