BigTV English

Sr.NTR: వేలం పాటలో సీనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన కార్.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

Sr.NTR: వేలం పాటలో సీనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన కార్.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

Sr.NTR: తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌరాణిక, సాంఘిక, చారిత్రక వంటి పలు జానర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ నే గుర్తు చేసుకుంటారు. అంతలా తన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. ఇకపోతే సినిమాల ద్వారా ముఖానికి రంగు వేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తన గొప్ప మనసుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు అడుగులు వేయించారు. పేదల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ పథకాలు నేటికీ అమలులో ఉన్నాయి అంటే ఎన్టీఆర్ చేపట్టిన ఆ పథకాలు ఎంతలా ప్రజలలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. అంతలా అటు సినిమా పరంగా ఇటు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్.


వేలం పాటలో సీనియర్ ఎన్టీఆర్ కారు..

ఇకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కి కార్లంటే చాలా ఇష్టమట. అందులో ప్రత్యేకించి ఒక కారును ఎంతో ఇష్టంగా ఎక్కువ రోజులు ఉపయోగించారట. ఆ కార్ ఏదో కాదు అంబాసిడర్ కారు. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన బ్రతికున్నంత వరకు.. ఆఖరికి చివరి రోజుల్లో కూడా అదే కార్ ను ఉపయోగించారట ఎన్టీఆర్. పైగా ఆయనకు ఆ కార్ అంటే ఇష్టం మాత్రమే కాదు సెంటిమెంట్ అని కూడా సమాచారం. ఆ కార్ నంబర్ ABY 9999. ఎన్టీఆర్ స్వర్గస్తులైన తర్వాత ఆ కారు ప్రభుత్వం వద్దే ఉండిపోయింది. ఇకపోతే అప్పుడప్పుడు పాత వస్తువులను ప్రభుత్వం వేలంపాట వేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా వేలం పాటలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన అంబాసిడర్ కారుని కూడా వేలం వేసింది ప్రభుత్వం. అయితే ఆ వేలం పాటలో అనూహ్యంగా ఎన్టీఆర్ మనవడైన ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఆ కార్ ను కొనుగోలు చేశారట.


వేలం పాటలో తాతకి ఇష్టమైన కారును కొనుగోలు చేసిన కళ్యాణ్ రామ్..

ముఖ్యంగా తాతయ్య మీద ఉన్న ఇష్టం తోనే కళ్యాణ్ రామ్ ABY 9999 నంబర్ కలిగిన అంబాసిడర్ కారును సొంతం చేసుకున్నారు. వేలం పాటలో పాడి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం గమనార్హం.ప్రస్తుతం ఈ కారు కళ్యాణ్ రామ్ ఆఫీస్ లోనే ఉంటుంది. కళ్యాణ్ రామ్ ఆఫీస్ కి వెళ్ళగానే బయట సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కారు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా కళ్యాణ్ రామ్ ఆఫీస్ కి మొదటిసారిగా వెళితే కచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కారు ముందు ఫోటోలు దిగి మరీ వస్తారు. ఇక కళ్యాణ్ రామ్ తన తాత మీద ఉన్న ప్రేమతో ఆయనకు గుర్తుగానే ఈ కారును తన ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక ఆస్తికి ఎవరైతే వారసులో అది తిరిగి తిరిగి మళ్ళీ వారి దగ్గరికే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కూడా తన తాత లాగే తన కారులన్నింటికీ 9999 అనే నంబర్ కోసం లక్షల ఖర్చు చేస్తారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలో ఆ 9 అనే నంబరు సెంటిమెంట్ చాలా ఎక్కువ అని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×