Madha Gaja Raja Movie Review : ఎప్పుడో 2012 లో రిలీజ్ కావాల్సిన ‘మదగజరాజ’ 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి అక్కడ రూ.50 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. విశాల్ కొత్త సినిమాలకే రాని ఈ ఓపెనింగ్స్ ఈ సినిమాకి రావడంతో సినిమాలో మేటర్ ఉందేమో అని భావించి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
రాజు అలియాస్ మదగజరాజ(విశాల్) ఓ కేబుల్ ఆపరేటర్. అయితే రిటైర్మెంట్ కి దగ్గరపడుతున్న అతని తండ్రి ఎస్సై అవ్వడం వల్ల అతను చేయాల్సిన రిస్కీ ఆపరేషన్లు ఇతను చేస్తుంటాడు. అలా ఓ కేసులో భాగంగా ఇతనికి మాధవి(అంజలి) పరిచయం అవుతుంది. కానీ రాజు తండ్రి వల్ల వీళ్ళు విడిపోవాల్సి వస్తుంది. తర్వాత అతని చిన్న నాటి మాస్టారు కూతురి పెళ్ళి కోసం వెళ్ళిన రాజు అక్కడికి వచ్చిన అతని స్నేహితుల కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు అని తెలుసుకుని ఒక్కొక్కరి సమస్య తీర్చి వాళ్ళని హ్యాపీగా పంపాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మొదటి స్నేహితుడు(సంతానం) అలాగే అతని భార్య మధ్య ఉన్న వైరాన్ని తీరుస్తాడు. తర్వాత మరో ఇద్దరు స్నేహితుల్లో ఒకరు జైలుకి వెళ్ళాల్సి రావడం, మరొకరు సూసైడ్ చేసుకునే వారుగా ఉండటం.. వల్ల వాళ్ళ సమస్యలకి కారణమైన కాకర్ల విశ్వనాథ్ (సోనూ సూద్) తో గొడవ పెట్టుకుంటాడు. తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ శాతం.. దీన్ని ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ తో కాకుండా.., 13 ఏళ్ళకి రిలీజ్ అయినా… ‘మద గజ రాజ’ ఏ రకంగా తమిళంలో సూపర్ హిట్ అయ్యి రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది? ఆ ప్రశ్నకి సమాధానం కోసమే చాలా మంది థియేటర్లకి వెళ్తారు. అలాంటి వాళ్లకి మొదటి సీన్ నుండే సమాధానాలు దొరికేస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం పరమ రొటీన్ గా ఉన్నప్పటికీ సంతానం వన్ లైనర్ డైలాగ్స్ హిలేరియస్ గా అనిపిస్తాయి. అలాగే వరలక్ష్మీ గ్లామర్ కూడా ఫస్ట్ హాఫ్ కి అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో రొటీన్ సీన్లు వస్తున్నప్పటికీ మనోబాల పాత్రతో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ మళ్ళీ అందరినీ నవ్వించే విధంగా ఉంటుంది. ఇవన్నీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయినా అవ్వకపోయినా బి,సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. దర్శకుడు సుందర్ సి కూడా అలాంటి ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి సన్నివేశాలు రాసుకున్నాడు. వాళ్ళు కాకుండా మిగిలిన ప్రేక్షకులకి ఇది రోత కొట్టుడు సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది.విజయ్ ఆంటోనీ మ్యూజిక్, పాటలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అందించిన రిచర్డ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. అనవసరమైన సన్నివేశాలు ఇంకా ట్రిమ్ చేసుకునే స్కోప్ ఉన్నా.. ఎడిటర్లు ఎందుకో అలాంటి స్టెప్ తీసుకోలేదు. నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే.. విశాల్ స్థాయి సినిమాలకి తగ్గట్టే ఉన్నాయి. అంతకు ఎక్కువ లేవు.. తక్కువ అనిపించవు.
నటీనటుల విషయానికి వస్తే.. విశాల్ 10 ఏళ్ళ ముందు చూడటానికి మరింత ఎనర్జిటిక్ గా కనిపించాడు. కాకపోతే తెలుగు వెర్షన్ కి ఎందుకో విశాల్ డబ్బింగ్ చెప్పుకోలేదు. హేమచంద్రతో చెప్పించిన డబ్బింగ్ కూడా సో సో గానే ఉంది. తమిళంలో వచ్చిన కలెక్షన్లే ఎక్కువ అనుకున్నాడేమో తెలుగు ప్రమోషన్లకు విశాల్ ఎగ్గొట్టేశాడు. హీరోయిన్లు అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్.. లు గ్లామర్ షోలకే సరిపోయారు. వరలక్ష్మీ థైస్ షోలు, క్లీవేజ్ షోలు.. అంజలి బొడ్డు అందాలు బొద్దుగా ఉండటం వల్ల సెట్ కాలేదు. సోనూ సూద్ వెరీ రెగ్యులర్ విలన్లా తన పని తాను చేసుకుంటూ పోయాడు. సంతానం కామెడీ అనడంకంటే కొంచెం అతిశయోక్తి అనిపించినా అతని వన్ లైనర్స్ బాగా నవ్వించాయి. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ గాయత్రీ రావు సంతానం భార్యగా చేసి కొంచెం నవ్వించే ప్రయత్నం చేసింది. మనోబలా కామెడీ ఓవర్ ది టాప్ అనిపించినా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. ఆర్య గెస్ట్ రోల్లో కనిపించి టైం పాస్ చేయించాడు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
హీరోయిన్ల గ్లామర్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
రెగ్యులర్ స్క్రీన్ ప్లే
మొత్తంగా ‘మదగజరాజ’ ఔట్-డేటెడ్ రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా అయినప్పటికీ పైన చెప్పుకున్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని టైం పాస్ చేయించగలదు.
Madha Gaja Raja Movie Rating : 2.25/5