BigTV English
Advertisement

Thug Life: కమల్ కు భారీ ఊరట.. క్షమాపణలు వద్దు థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే!

Thug Life: కమల్ కు భారీ ఊరట.. క్షమాపణలు వద్దు థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే!

Thug Life: లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Hassan)హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం థగ్ లైఫ్(Thug Life). ఈ సినిమా జూన్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో భారీ స్థాయిలో నష్టాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా అంటే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ హీరో శింబు(Simbu) కూడా భాగం కావడం విశేషం. ఇలా మణిరత్నం కమల్ కాంబో సినిమా అనగానే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఊహించుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో మణిరత్నం మ్యాజిక్ వర్క్ అవుట్ అవ్వలేదని చెప్పాలి.


తమిళం నుంచి కన్నడ పుట్టింది…

ఇక ఈ సినిమా విడుదలకు ముందు కమల్ హాసన్ పెద్ద ఎత్తున వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనగా మారాయి. కన్నడ భాష(Kannada Language) తమిళం నుంచి పుట్టిందే అంటూ ఈయన మాట్లాడారు. అయితే తమిళం నుంచి కన్నడ భాష పుట్టడం ఏంటి?కన్నడ భాషను అవమాన పరుస్తూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కన్నడిగులు డిమాండ్లు వ్యక్తం చేశారు.


వెనక్కు తగ్గని కమల్..

ఇలా కన్నడ భాషను అవమాన పరుస్తూ మాట్లాడటంతో ఈయన నటించిన థగ్ లైఫ్ సినిమాని కూడా కర్ణాటకలో(Karnataka) విడుదల చేయనివ్వము అంటూ ఈయనకు నిరసన సెగలు ఎదురయ్యాయి.. ఇక ఈ విషయంలో కోర్టుకు వెళ్లడంతో కోర్టు క్షమాపణలు చెప్పాలని కోరినప్పటికీ కమల్ హాసన్ మాత్రం తానేమి తప్పుగా మాట్లాడలేదని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అంటూ తను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికి క్షమాపణలు తెలుపలేదు. ఇలా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోవడం కర్ణాటకలో ఈ సినిమా విడుదల కాలేదు.

థగ్ లైఫ్ విడుదలకు లైన్ క్లియర్….

ఇకపోతే కర్ణాటకలో ఈ సినిమా విడుదలను కోరుతూ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై కోర్టు కమల్ హాసన్ కు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. కర్ణాటకలో కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్ లైఫ్ సినిమాని విడుదల చేయాల్సిందేనని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఇక అతనిని ఎవరు క్షమాపణలు కోరకూడదని సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు కలుగచేయకుండా విడుదలకు లైన్ క్లియర్ చేసింది. ఏది ఏమైనా కమల్ హాసన్ చివరికి తన సినిమాని కన్నడలో విడుదల చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తెలుగు తమిళ హిందీ భాషలలో ఈ సినిమా విడుదల అయినప్పటికీ పెద్దగా అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు కర్ణాటకలో విడుదల చేసిన పెద్దగా పాజిటివ్ టాక్ రాదని పలువురు భావిస్తున్నారు. మరి ఇక్కడ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కన్నడలో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: మెగాఫాన్స్ కు పండగే.. రాజా సాబ్ సినిమాలో చిరు.. టీజర్ లో ఇది గమనించారా?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×