Kamal Haasan: కమల్ హాసన్.. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. పాన్ ఇండియా హీరోలు అని ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కానీ, ఆ పదం రాకముందే లోక నాయకుడు అనే పేరును సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరో, విలన్, సపోర్టివ్ రోల్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, రైటర్.. ఇలా ఒకటి అని చెప్పలేం. 24 క్రాఫ్ట్స్ లో తనకంటూ ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు.
నటనకు నవత.. తరగని యువత.. అని దశావతారంలో ఒక సాంగ్ లో ఆయన ప్రయాణాన్ని మొత్తం వివరిస్తారు. అందులో ఏ అక్షరం అబద్దం కాదు అని చెప్పాలి. ప్రయోగం ఏదైనా.. పాత్ర ఏదైనా కమల్ దిగనంతవరకే.. ఒక్కసారి ఆయన దిగాడు అంటే ఇక ఆ పాత్ర గురించి మర్చిపోవడమే. నేడు కమల్ హాసన్ 70 వ పుట్టినరోజు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Sai Pallavi: ఆ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ
విక్రమ్ సినిమాతో కమల్ విజయ పరంపర మళ్లీ మొదలయిందని చెప్పొచ్చు. మధ్యలో భారతీయుడు 2 దెబ్బ కొట్టినా.. ఇప్పుడు అందరి చూపు థగ్ లైఫ్ మీదనే ఉంది. మణిరత్నం – కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా నేడు కమల్ బర్త్ డే సందర్భంగా థగ్ లైఫ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఇక కమల్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఆయన లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో కమల్ కారు దిగి.. ఆఫీస్ లోకి వెళ్తున్నట్లు కనిపించాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా లోక నాయకుడు లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. కొద్దిగా నెరిసిన గడ్డం.. టైట్ టీ షర్ట్.. గాగుల్స్ పెట్టుకొని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించాడు.
Sai Pallavi: ఆ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ
ఇక కమల్ ను ఇలా చూసిన అభిమానులు.. 70 ఏళ్ల వయస్సులో కూడా ఆ ఫిట్ నెస్ ఏంటి మావా.. నెక్ట్స్ లెవెల్ అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది.. అబ్బే ఈయనకు ఇంకా వయస్సు అవ్వలేదు.. అని చెప్పుకొస్తున్నారు. మరి కమల్.. థగ్ లైఫ్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.