BigTV English

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ కస్డడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 14వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.


లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో దర్యాప్తు సంస్థలు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచాయి. కవిత జ్యుడీషియల్ కస్టడీ అంశం పై జడ్జి కావేరి బవేజా విచారణ జరిపి.. మరో వారం పాటు కస్టడీని పొడిగించింది.

కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ,సీబీఐలు కోర్టును కోరాయి. జైలులో కవితకు 10 పుస్తకాలు అనుమతించాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రానా కొర్టును కోరారు. దీంతో పాటుగా కోర్టులో కవితను 15 నిముషాల పాటు కలిసిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు.


కోర్టు లాకప్ లో కవితకు తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని న్యాయవాది నితీష్ రానా కోర్టులో అభ్యర్థించారు. ప్రస్తుతం జైలులో కవితకు ఇచ్చే ఇంటి భోజనాన్ని 10-15 మంది పోలీసులు చెక్ చేసిన పాడు చేసిన తర్వాత ఆ ఆహారాన్ని ఆమెకు అందిస్తున్నారని.. అలా కాకుండా జైలు అధికారి చెక్ చేసి కవితకు అందించాలని కోర్టును కవిత న్యాయవాది కోరారు.

కవిత ఇంటి భోజనం వద్దన్న తరువాత మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని న్యాయమూర్తి కవిత న్యాయవాదని ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్ ను వివరణ కోరుతామని న్యాయమూర్తి వెల్లడించారు.

Also Read: తెలంగాణతో కేసీఆర్‌‌కు పేరు బంధం లేదు.. పేగు బంధం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ఇరువురి వాదనలు విన్న కోర్టు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది. దీంతో విచారణ ముగిసిన అనంతరం కోర్టు ఆవరణలో కవితను ఆమె భర్త అనిల్, మాజీ ఎంపీ సంతోష్ భార్య, మరో కుటుంబ సభ్యురాలు కలిసారు. అయితే లిక్కర్ పాలసీ కేసులో భాగంగా వారం రోజుల్లో కవితపై చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టులో ఈడీ అధికారులు వెల్లడించారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×