Justin Langer: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ( Lucknow Super Giants ) అదిరిపోయే శుభవార్త చెప్పాడు ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్. లక్నో స్టార్ ఆటగాడు మయాంక్ యాదవ్ ఫిట్నెస్ పై కీలక ప్రకటన చేశాడు. అతి త్వరలోనే లక్నో జట్టు చేరిపోతాడని మయాంక్ యాదవ్ ఫిట్నెస్ పైన క్లారిటీ ఇచ్చాడు ఆ జట్టు జస్టిన్ లాంగర్. శుక్రవారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్.. గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పైన విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత… లక్నో సూపర్ జెంట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిన్ లాంగర్ ( Justin Langer ). జట్టులోకి యువ ఫేస్ బౌలర్ రాబోతున్నాడని ప్రకటించారు.
Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!
యువ ఆటగాడు మయాంక్ యాదవ్ ( Mayank Yadav) అతి త్వరలోనే జట్టులో చేరిపోతాడని కూడా వివరించారు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం 90 నుంచి 95% తీవ్రతతో బౌలింగ్ చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలోనే పూర్తి స్థాయి ఫిట్నెస్ కూడా సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు జస్టిన్ లాంగర్. ఇక గడిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సమయంలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్. ఒక్కో బంతి 150 కిలోమీటర్లకు పైగా స్పీడ్ తో… విసిరేవాడు. అలాంటి మయాంక్ యాదవ్… ప్రపంచ స్థాయి క్రికెటర్లను కూడా వనికించాడు. అయితే స్పీడ్ బౌలింగ్ చేసిన నేపథ్యంలో… గత ఐపీఎల్ సీజన్ 2024 లోనే వెన్నునొప్పి అలాగే కాలి వేలుకు గాయం… అయింది. ఈ దెబ్బకు.. మయాంక్ యాదవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్కు దూరమయ్యాడు.
గత ఏడాది కాలం నుంచి… ఫిట్నెస్ పైన సాధన చేస్తున్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 ) భాగంగా… లక్నో ఆడిన మొదటి మ్యాచ్లను కూడా మిస్ అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతి త్వరలోనే మయాంక్ యాదవ్ జట్టులోకి వస్తాడని జస్టిన్ లాంగర్ ( Justin Langer )మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ విషయం మాట్లాడుతుండగానే… జస్టిన్ లాంగర్ కు ప్రెస్ మీట్ లో ఇంటి నుంచి ఫోన్ కాల్ ( Phone Call ) వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి… తాను ప్రెస్ మీట్ లో ఉన్నట్లు లాంగర్ క్లారిటీ ఇచ్చారు. అర్ధరాత్రి 12 దాటింది అమ్మ అంటూ తన తల్లికి వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
Also Read: LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?
A phone call in the middle of the press conference 📞
Good news on Mayank Yadav's recovery 📰
And the importance of National Cricket Academy (BCCI's COE) 👏
🎥 #LSG Head Coach, Justin Langer, has a field day at the post-match press conference 😊#TATAIPL | #LSGvMI pic.twitter.com/JAolaa5GTo
— IndianPremierLeague (@IPL) April 4, 2025