Dear Krishna : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘డియర్ కృష్ణ’ (Dear Krishna) మూవీ త్వరలోనే తెరపైకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో వేగం పెంచారు. అందులో భాగంగానే తాజాగా ‘డియర్ కృష్ణ’ మూవీ బిగ్ టికెట్ ను హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్.
అక్షయ్ (Akshay) హీరోగా, ‘ప్రేమలు’ ఫేమ్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju), ఐశ్వర్య (Aishwarya) హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘డియర్ కృష్ణ’ (Dear Krishna). ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఓవైపు ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంటే, మరోవైపు మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. పిఎన్బి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో ఆది చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ మూవీ బిగ్ టికెట్ ను రిలీజ్ చేశారు.
ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఆది (Aadi Sai Kumar) హీరోగా నటిస్తున్న ‘శాంబల’ చిత్రం సెట్ కు వెళ్లారు. అక్కడే ఆది సాయి కుమార్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ మూవీ బిగ్ టికెట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని చూసే అభిమానులకు మూవీ రిలీజ్ సందర్భంగా నిర్మాత పిఎన్బి బలరాం ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ‘డియర్ కృష్ణ’ మూవీకి సంబంధించి మొదటి 100 టికెట్ల బుకింగ్ లో ఒక టికెట్ ను డిపింగ్ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేసి, ఆ లక్కీ ప్రేక్షకుడికి రూ. 10,000 క్యాష్ బ్యాక్ కింద శ్రీకృష్ణుడి బహుమతిని అందించబోతున్నామని ప్రకటించారు. అయితే ఇది కేవలం ఒకరికి మాత్రమే కాదు, ఇదే పద్ధతిని వారం రోజుల పాటు కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే దాదాపు 8 మంది ప్రేక్షకులు లక్కీ విన్నర్స్ కావొచ్చన్న మాట.
ఇక ‘డియర్ కృష్ణ’ (Dear Krishna) మూవీ విషయానికి వస్తే… యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. శ్రీకృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని, మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీకి పీఎన్బీ బలరాం (PNB Balaram) రచయిత, నిర్మాతగా వ్యవహరిస్తుండగా, దినేష్ బాబు (Dinesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ‘డియర్ కృష్ణ’ మూవీకి హరి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 24న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మమితా బైజు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరి ఆమె పాపులారిటీ ఈ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే ఆసక్తి నెలకొంది.