Janvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగులో గతేడాది వచ్చినా ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ధి’ సినిమాలో నటిస్తుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ లో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది విన్న మా ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అసలేం జరిగిందో? ఆమెకు చిన్న వయసులో వచ్చిన పెద్ద సమస్య ఏంటో చూద్దాం..
పెద్ద సమస్యతో పోరాడుతున్న జాన్వీ..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రతి నెల అతి పెద్ద సమస్యతో పోరాడుతున్నానని చెబుతుంది. ఆమెకు పీరియడ్స్ పెద్ద సమస్య అట. అదేంటి ఆడవాళ్లు అన్నాక పీరియడ్స్ ప్రతి నెల రావడం కామన్. నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అది నేచురల్ గా జరిగే విషయమే అయినప్పటికీ.. నెలసరి సమస్య గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జాన్వీ కపూర్ మాత్రం తాను ఎదుర్కొంటున్న సమస్యను బయట పెట్టింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్.. తన ఫస్ట్ పీరియడ్ అనుభవాన్ని పంచుకుంది. తనకు పీరియడ్స్ టైంలో విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయని.. తన మాటను బట్టే తనకు పీరియడ్స్ అన్న విషయం అందరికీ తెలిసిపోతుందని జాన్వీ చెప్తున్నారు. నెలసరి బాధ అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుందన్నారు జాన్వీ కపూర్. పీరియడ్స్ సమయంలో మహిళలు పడే బాధను వర్ణించలేమని, ఇలాంటి బాధ పురుషులకి వస్తే పెద్ద యుద్ధమే చేస్తారేమో అస్సలు భరించలేరు కదా అనేసి ఆమె అన్నారు. అయితే జాన్వీకి పీరియడ్స్ టైం లో భరించలేని నొప్పితో పాటుగా ముక్కు నుంచి రక్తం కారేదని చెప్పింది. ప్రస్తుతం అయితే ఈ సమస్య కాస్త తగ్గిందని ఆమె అంటున్నారు మొత్తానికైతే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : ప్రవస్తికి గట్టిగా తగిలేట్టుగానే ఇచ్చిన సునీత.. ఫ్యూజులు అవుట్ అయినట్లే..?
జాన్వీ సినిమాల విషయానికొస్తే..
ఈ అమ్మడు స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా ‘ధడక్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించింది. సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా జాన్వీ కపూర్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తుంది. వచ్చేయడాది మార్చిలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.