BIG TV LIVE Originals: కండోమ్‌లు సాధారణంగా ఆరోగ్యం, భద్రత కోసం ఉపయోగిస్తారు. అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడంతో పాటు ఎయిడ్స్ సహా అనేక రకాల సుఖ వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు వీటిని వాడుతారు. అయితే, కొన్ని కండోమ్‌లు అరుదైన తయారీ విధానం, విలాసవంతమైన డిజైన్ కారణంగా అత్యంత ఖరీదైనవిగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కండోమ్ ఏది? దాని ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ఇదే!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కండోమ్ 200 సంవత్సరాల క్రితం నాటిది. ఈ కండోమ్ గొర్రెల పేగులతో తయారు చేశారు. రీసెంట్ గా నిర్వహించిన వేలంలో ఈ కండోమ్ ఏకంగా £460 (భారత కరెన్సీలో సుమారు రూ. 44,000) ధర పలికింది. ఈ పురాతన కండోమ్ ను ఫ్రాన్స్ లో కనుగొన్నారు. ఆమ్ స్టర్ డామ్ అనే వ్యక్తి వేలంపాట వెబ్ సైట్ లో దీనిని కొనుగోలు చేశాడు.
ఈ కండోమ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర?
చాలా మంది ఈ వేలం పాటను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంత ధర పలికింది? అని సోషల్ మీడియా ద్వారా ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక సాధారణ కండోమ్ కాదు. ఒక చారిత్రక వస్తువు. 1800లలో చాలా అరుదైన కండోమ్ లు తయారు చేశారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఈ కండోమ్ గురించి Catawiki అనే వేలం పాట నిర్వహించిన వెబ్ సైట్ కీలక విషయాలు వెల్లడించింది. “ఈ పురాతన కండోమ్ ఒక అద్భుతమైన చారిత్రక వస్తువు. ఇది గర్భనిరోధక సాధనాల పరిణామం, చరిత్రను వెల్లడిస్తుంది” అని వివరించింది.
తక్కువ ధరలో కండోమ్ ల లభ్యత
ఈ రోజుల్లో కండోమ్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. HANX అనే లగ్జరీ కండోమ్ బ్రాండ్ 10 కండోమ్‌ల ప్యాక్‌ను $16 (భారత కరెన్సీలో సుమారు ₹1,300)కు అందుబాటులో ఉంచింది. అంటే ఒక్కో కండోమ్ ధర సుమారు రూ. 130. Naked అనే మరో బ్రాండ్ ను ప్రపంచంలోనే ఏకైక లగ్జరీ కండోమ్ గా పిలుస్తారు. కానీ, దీని ధర కూడా HANX ధరకు ఇంచుమించు దగ్గరగానే ఉంటుంది. Durex, LifeStyles Skyn లాంటి ప్రసిద్ధ బ్రాండ్ల కండోమ్ లు మరింత సరసమైనవి.
ఆర్థిక సంక్షోభంలో అధిక ధరలు
కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా కండోమ్‌ల ధరలు అధికంగా పలికిన సందర్భాలు ఉన్నాయి. 2015లో వెనిజులాలో 36 కండోమ్‌ల ప్యాక్ ధర $755 (సుమారు రూ.47,000)కు అమ్మారు. అంటే, ఒక్కో కండోమ్ ధర సుమారు ₹1,300 పలికింది. ఆ దేశంలో అతి ద్రవ్యోల్బణం, దిగుమతి ఆంక్షల కారణంగా ధరలు అమాంతం పెరిగాయి. కానీ, ఈ ధర 200 సంవత్సరాల నాటి కండోమ్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. ఆధునిక కండోమ్‌లు ఎంత లగ్జరీగా ఉన్నా, అవి ఈ ధరలకు దగ్గరగా కూడా రాలేవంటున్నారు నిపుణులు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: కక్కుర్తి పడి కడుపు తెచ్చుకొనే ఈ మగ జీవి గురించి మీకు తెలుసా?