Pushpa Re Release: అల్లు అర్జున్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే ‘పుష్ప’కు ముందు, ‘పుష్ప’కు తర్వాత అనే అనుకోవాలేమో. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. తనను ప్యాన్ ఇండియా హీరో చేసింది. ఇందులో ఈ హీరో స్టైల్, మ్యానరిజం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఫాలో అయ్యారు. అలా వరల్డ్ వైడ్‌గా ‘పుష్ప’ గురించి ట్రెండ్ అయ్యింది. ఈ సినిమా క్లైమాక్స్‌లోనే దీని సీక్వెల్ గురించి చెప్తూ ముగించాడు దర్శకుడు సుకుమార్. కానీ మూడేళ్ల నుండి ఆ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదలకు టైమ్ వచ్చేసింది. కానీ అమెరికాలో ఉన్న ఫ్యాన్స్‌కు మాత్రం ఈ ట్రైలర్‌తో పాటు మరొక గుడ్ న్యూస్ కూడా ఉంది.
అక్కడ మాత్రమే
‘పుష్ప’ సినిమా విడుదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. అలా మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘పుష్ప’ను, ఆ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌ను చాలామంది ప్రేక్షకులు మర్చిపోలేదు. కానీ సీక్వెల్‌కు హైప్ క్రియేట్ చేయాలంటే మళ్లీ ఆ పుష్ప మ్యానియాను తెరపైకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ చేశారు. అందుకే ‘పుష్ప’ రీ రిలీజ్‌కు రంగం సిద్ధం చేశారు. కానీ ఈ రీ రిలీజ్ ఇండియాలో మాత్రం కాదు. కేవలం అమెరికా వ్యాప్తంగా ‘పుష్ప ది రైజ్’ రీ రిలీజ్‌కు సిద్ధమయ్యిందని మేకర్స్ ప్రకటించారు. దానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా బయటపెట్టారు.
Also Read: అడ్వాన్స్ బుకింగ్స్ లో నీయవ్వ తగ్గేదేలే .. ఎన్ని కోట్లంటే?
సీక్వెల్ కోసం
నవంబర్ 19న అమెరికా వ్యాప్తంగా ‘పుష్ప’ (Pushpa) సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. అంతే కాకుండా అదే రోజు ‘పుష్ప 2’ (Pushpa 2) ట్రైలర్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాన్స్ అంతా ‘పుష్ప 2’ ట్రైలర్‌ను ఎంజాయ్ చేస్తే అమెరికాలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సెకండ్ పార్ట్ ట్రైలర్‌తో పాటు ఫస్ట్ పార్ట్‌ను కూడా మరోసారి వెండితెరపై ఎంజాయ్ చేయనున్నారు. దీంతో అక్కడ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. నవంబర్ 19న మరోసారి థియేటర్లలో విడుదల కానున్న ‘పుష్ప’కు సంబంధించిన బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కానున్నాయని కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ‘పుష్ప 2’పై మరింత బజ్ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.
నెగిటివ్ టాక్
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సినిమానే ‘పుష్ప’. ఈ మూవీ 2021 డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకు వచ్చింది. మొదట్లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో మొదలయ్యింది. చాలామంది సినిమా అస్సలు బాలేదని నెగిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. కానీ మెల్లగా పుష్ప మ్యానియా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇతర భాషా ప్రేక్షకులు కూడా దీనిని ఆదరించడం మొదలుపెట్టారు. దీంతో కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ సునామీ సృష్టించింది. పైగా సీక్వెల్‌పై కూడా అంచనాలు పెంచేసింది. కానీ ఇప్పటికే ఈ సీక్వెల్ ఎన్నోసార్లు విడుదలను వాయిదా వేసుకుంది. మొత్తానికి 2024 డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది.
The PUSHPA MASS SWAG show returns once again before the MASSIVE ENTERTAINMENT STAMP of #Pushpa2TheRule ❤️🔥#PushpaTheRise Grand Re-Release across the USA on NOV 19th! 💥💥❤️❤️
Bookings open shortly ⏳#Pushpa #Pushpa2 #Pushpa2USA pic.twitter.com/kRUq0roEH7
— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 11, 2024