BigTV English

Kannada actor Aparna dies: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, నటి అపర్ణ ఇక లేరు

Kannada actor Aparna dies: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, నటి అపర్ణ ఇక లేరు

Kannada actress Aparna death news(Cinema news in telugu): కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్స్, కెరీర్ సరిగా లేక మనస్థాపానికి గురై మరికొందరు చనిపోతున్నారు. అనారోగ్యం తో మృతి చెందినవారు ఉన్నారు. తాజాగా శాండిల్‌వుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఫేమస్ యాంకర్, నటి అపర్ణ కన్నుమూశారు.


57 ఏళ్ల నటి అపర్ణ వస్తారే గురువారం రాత్రి బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. గడిచిన రెండేళ్లుగా ఆమె లంగ్ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. గురువారం పరిస్థితి మరింత విషమించడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్తు కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. నటి అపర్ణ 1966లో జన్మించారు. ఆమె భర్త నాగరాజు సినీ రైటర్.

నటి, టీవీ యాంకర్, రేడియో జాకీగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి అపర్ణ. 1984లో పుట్టన్న కనగల్ డైరెక్షన్‌లో మసవాడ పువ్వు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడ లేదు. గ్లామర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారామె. స్టార్ నటుడు అంబరీస్ సినిమాల్లోనూ నటించారు. సంగ్రామ, సాహసవీర, మాతఋ వాత్సల్య, ఇన్స్‌పెక్టర్ విక్రమ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారమె. అపర్ణ చివరి సినిమా గ్రే గేమ్స్.


2003లో మూదల మావే టీవీ సీరియల్‌తో పాపులర్ అయ్యారు అపర్ణ. ఇవికాకుండా చాలా సీరియల్స్‌లో కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పదేళ్ల కిందట బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 1998లో దీపావళి కార్యక్రమంలో ఏకంగా 8 గంటలపాటు మోస్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశారామె.

ALSO READ: ఇండియన్‌ 2 మూవీపై ట్విట్టర్‌ రివ్యూలు..

బెంగుళూరు మెట్రో అనౌన్స్‌మెంట్‌లో వినిపించే స్వరం కూడా ఆమెదే. ఆమె మరణవార్త విన్న కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆమెకు సంతాపం తెలిపారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×