BigTV English

NBK 109 Movie Update: ‘ఎన్‌బీకే 109’ అప్డేట్.. బాయ్యలను ఢీ కొట్టే పాత్రలో కన్నడ స్టార్ హీరో

NBK 109 Movie Update: ‘ఎన్‌బీకే 109’ అప్డేట్.. బాయ్యలను ఢీ కొట్టే పాత్రలో కన్నడ స్టార్ హీరో

NBK 109 Movie Update(Latest news in tollywood): నందమూరి నటసింహం బాలయ్య బాబు చివరి మూవీ ‘భగవంత్ కేసరి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించి తన అభిమానులకు మంచి ట్రీట్ అందించాడు. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య బాబు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దర్శకుడు బాబీ‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.


ఈ మూవీ కూడా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌‌పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో బాలయ్య బాబు మాస్ అండ్ యాక్షన్ లుక్, ఫైట్ సీన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

Also Read: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ కుదిరింది..!


కాగా ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అందరిలోనూ అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకుంటున్న చాందిని చౌదరి కూడా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలా ప్రేక్షకుల్లో మంచి ఫేం ఉన్న నటీ నటులు బాలయ్య మూవీలో నటిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న నటుడిని పరిచయం చేశారు. ఇందులో బాలయ్యబాబును ఢీ కొట్టే పాత్రలో ‘కవలుదారి’ మూవీ ఫేం కన్నడ యాక్టర్ రిషి నటిస్తున్నట్లు తెలిపారు. రిషి ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇవాళ రిషి బర్త్ డే సందర్భంగా అతడికి విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్ వదిలారు. త్వరలో ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×