Triptii Dimri : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Triptii Dimri). ఈ అమ్మడు తన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా త్రిప్తి డిమ్రీ ఓ స్పెషల్ ఫోటోని షేర్ చేసింది. దీంతో ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ ని కన్ఫామ్ చేసినట్టేనా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సామ్ మర్చంట్ కు స్పెషల్ విషెస్
త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) డేటింగ్ రూమర్స్ కి ఓ ఫోటోతో ఆజ్యం పోసింది. గురువారం రోజు త్రిప్తి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లో ఉన్నప్పటి ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. అందులో త్రిప్తితో పాటు సామ్ (Sam Marchant) కూడా సన్ గ్లాసెస్ ధరించి సెల్ఫీకి నవ్వుతూ ఫోజులిచ్చారు. అలా కృతి షేర్ చేసిన అన్ సీన్ ఫోటోలలో ఓ దాంట్లో కారు నడుపుతున్నట్టుగా సామ్ కనిపించగా, మరో దాంట్లో అతను వెండి ఆభరణాలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు అన్నింటినీ ఒకే ప్రేమ్ లో బంధించి “హ్యాపీ బర్త్ డే సామ్ మర్చంట్” అంటూ హార్ట్ ఎమోజిని షేర్ చేసింది. “నువ్వు అందరికీ పంచిన ప్రేమానురాగాలు నీకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను” అనే క్యాప్షన్ తో ఆ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఆమె ఈ ఫోటో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్ గా మారింది.
సామ్ మర్చంట్ ఎవరు ?
త్రిప్తి (Triptii Dimri), సామ్ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు నడుస్తున్నాయి. కానీ వీరిద్దరూ తమ రిలేషన్షిప్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. తరచుగా ఇద్దరు కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేయడం, డిన్నర్ కి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ జంట న్యూ ఇయర్ ని ఫిన్లాండ్లో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
కాగా సామ్ మర్చంట్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకు ఖరీదైన రెస్టారెంట్లు ఉన్నాయి. కాసా వాటర్స్, అవూర్ గోవా ఫౌండర్. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి అడుగు పెట్టకముందు ఆయన మోడల్‌గా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించారు. ఇక తన బిజినెస్ లో భాగంగా గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్లను స్టార్ట్ చేసి, సక్సెస్ ఫుల్ హోటలీర్ గా దూసుకెళ్తున్నాడు. అలాగే ఆయన ట్రావెల్ బ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్ లో 250K కంటే ఎక్కువ మందిని ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు.
త్రిప్తి డిమ్రీ అప్ కమింగ్ సినిమాలు
(Triptii Dimri) ‘భూల్ భూలయ్యా 3’ అనే హర్రర్ సినిమాలో గత ఏడాది కార్తీక్ ఆర్యన్ తో కలిసి తెరపై కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 5 న థియేటర్‌లలోకి రానుంది.