BigTV English

Upendra : ఆందోళన పడకండి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను

Upendra : ఆందోళన పడకండి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను

Upendra :  సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుడు మరియు దర్శకుడు ఉపేంద్ర. దర్శకుడుగా ఎన్నో యూనిక్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించాడు. డైరెక్టర్ ఉపేంద్ర కు చాలామంది ఇప్పుడున్న దర్శకులు కూడా అభిమానులు ఉన్నారు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నేను ఉపేంద్ర గారికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. అలానే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా నేను ఉపేంద్ర కి పెద్ద అభిమాని అంటూ తెలిపారు. ఇకపోతే రీసెంట్ గా ఉపేంద్ర యుఐ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి ప్రశంసలు వచ్చాయి.


ఆరోగ్యం బాగానే ఉంది

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు హాస్పిటల్ వద్ద కనిపిస్తే చాలు అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. ఆ వార్తలు గురించి ఏకంగా సెలబ్రిటీలే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. రీసెంట్గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రముఖ నటుడు ఉపేంద్ర ఖండించారు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అవాస్తవాల ప్రచారం వల్ల ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించారు. తనపై ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.


Also Read : Vishwak Sen: డైరెక్టర్ గా నటిస్తూ డైరెక్టర్ గా జీవిస్తున్నాడు, ఈ యంగ్ హీరోకి కం బ్యాక్ అవసరం

అంచనాలన్నీ కూలీ సినిమా పైన

గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు ఉపేంద్ర. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం. ఇదే పాత్ర కోసం గతంలో రాజశేఖర్ ను సంప్రదించారు. ఇది విలన్ పాత్రలో ఉంది అని ఒప్పుకోకపోవడం వలన సీనియర్ హీరో ఉపేంద్రను సంప్రదించారు త్రివిక్రమ్. ఉపేంద్ర చేయటం వల్లనే ఆ సినిమాకి ఒక ఫ్రెష్ ఫీల్ కూడా వచ్చింది. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమాలో ఉపేంద్ర పాత్ర ఎలా ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. అలానే కూలి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాను కమల్ హాసన్ కు అందించిన లోకేష్ రజనీకాంత్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో వేచి చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×