Vishwak Sen: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్సేన్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో కౌశిక్ అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఈ సినిమా తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు విశ్వక్సేన్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడుగా కూడా ఈ సినిమాతో మంచి మార్కులు సాధించుకున్నాడు విశ్వక్సేన్.
మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు
ప్రస్తుతం విశ్వక్సేన్ చేసిన లాస్ట్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మెకానిక్ రాఖీ సినిమా ఫెయిల్ అయింది. అలానే విశ్వక్సేన్ చేసిన లైలా సినిమా ఊహించిన డిజాస్టర్ చవి చూసింది. సాఫీగా వెళుతున్న విశ్వక్సేన్ కెరియర్ కు ఈ రెండు సినిమాలు ఊహించని బ్రేక్ వేసాయి. ఇక ప్రస్తుతం మణిదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్సేన్ ఫంకీ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో దర్శకుడు పాత్రలో కనిపిస్తున్నాడు విశ్వక్సేన్. అయితే మరోవైపు మరో సినిమాకి మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకి కల్ట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మాజీమంత్రి తలసాని కుమారుడు సాయి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ రెండు వర్కౌట్ అయితే కం బ్యాక్ ఖాయం
విశ్వక్సేన్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో చేస్తున్న ఫంకీ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. జాతి రత్నాలు సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళి అందుకోలేకపోయాడు అనుదీప్. అయితే ఈ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని నిర్మాత నాగ వంశీ నుంచి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఒకవేళ అదే నిజమైనట్లయితే నటుడుగా విశ్వక్ మళ్ళీ కం బ్యాక్ ఇచ్చినట్లే. ఒకవేళ ఇది ఏమాత్రం తేడా కొట్టిన కల్ట్ సినిమాతో దర్శకుడుగా కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపై ఏం జరగబోతుందో ఇంకొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.
Also Read : Jagadeka Veerudu Athiloka Sundari : ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం