SRH VS DC Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా ప్లే ఆఫ్ వెళుతుందని అందరూ అనుకుంటే…. వరుడు కరుణించలేదు. దీంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వైదొలిగిపోయింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి… రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ లిస్టులో మూడవ జట్టుగా హైదరాబాద్ చేరిపోయింది.
Also Read: Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే
కనుకరించని వరుణుడు
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Sunrisers Hyderabad vs Delhi Capitals ) మధ్య ఉప్పల్ లోని ( Uppal Match ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అద్భుతంగా కట్టడి చేశారు హైదరాబాద్ బౌలర్లు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది.
గత మ్యాచ్లలో… హైదరాబాద్ బౌలర్లు పెద్దగా రాణించలేదు కానీ… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మాత్రం అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పైన గెలిచి ప్లే ఆఫ్ ఆశలను పెంచుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభం కాకముందే వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు… రెండు నుంచి మూడు గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం మొత్తం తడిసి ముద్దయింది.
అయినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ రద్దు కావడంతో ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ జట్టు వైదొలిగింది. ఇవాళ మ్యాచ్ రద్దు కావడంతో హైదరాబాద్ ఖాతాలోకి 7 పాయింట్లు వచ్చాయి. మరో మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన కూడా 13 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఖచ్చితంగా 14 పాయింట్లు ఉంటేనే హైదరాబాద్ కు ప్లే ఆఫ్ ఛాన్సులు ఉంటాయి. కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
ఐపీఎల్ నుంచి వైదొలిగిన మూడు జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే మూడు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. ఇందులో మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలిమినేట్ కాగా… ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిన్న ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఇవాళ హైదరాబాద్ జట్టు కూడా ఇంటి దారి పట్టక తప్పలేదు. హైదరాబాద్ ఎలిమినేట్ కావడంతో… SRH ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !
SRH bow out of IPL 2025 – officially out of playoffs contention💔#IPL2025 #SRHvsDC #PatCummins #SunrisersHyderabad #CricketTwitter pic.twitter.com/nKYEzdMEbT
— InsideSport (@InsideSportIND) May 5, 2025