Rohit – Siraj: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Team India Captain Rohit Sharma) మంచి మనసు చాటుకున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజుకు ఖరీదైన రింగ్ ఇచ్చారు. 2024 t20 వరల్డ్ కప్ గెలిచిన ( 2024 T20 World Cup winner) నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు… స్పెషల్ రింగులు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ). ఆ సమయంలో టీమిండియా ప్లేయర్ లందరూ కలిసి… తమ తమ రింగులను అందుకున్నారు. ఈ రింగ్స్ ఇచ్చే నేపథ్యంలో… ముంబైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆ సమయంలో మహమ్మద్ సిరాజ్ అందుబాటులో లేడన్న సంగతి తెలిసిందే.
Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !
మహమ్మద్ సిరాజుకు రింగ్ ఇచ్చిన రోహిత్ శర్మ
ముంబై ఈవెంట్ లో మహమ్మద్ సిరాజ్ లేని నేపథ్యంలో స్వయంగా రోహిత్ శర్మ తన దగ్గర ఉన్న రింగును ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే… మహమ్మద్ సిరాజుకు కంగ్రాట్స్ చెప్పాడు రోహిత్ శర్మ. ముంబైలో జరిగిన కార్యక్రమానికి మహమ్మద్ సిరాజ్ దూరమయ్యాడని… టి20 వరల్డ్ కప్ సాధించడంలో అందరి కృషి ఉందని ఈ సందర్భంగా రోహిత్ శర్మ పేర్కొన్నారు. అయితే ఇవాళ… ఈ రింగ్ మహమ్మద్ సిరాజుకు ఇస్తున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం అంటే మే ఆరవ తేదీన… ముంబై వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
దీంతో ముంబై స్టేడియానికి గుజరాత్ ప్లేయర్లు అందరూ వచ్చారు. ఈసారి గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ కూడా ముంబైలో లాంచ్ అయ్యాడు.. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ సిరాజుకు టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో ఇచ్చిన… డైమండ్ రింగును అందించాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎంగేజ్మెంట్ చేసుకున్న సిరాజ్, రోహిత్ శర్మ
మహమ్మద్ సిరాజుకు డైమండ్ రింగ్ రోహిత్ శర్మ ఇవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహమ్మద్ సిరాజ్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని… త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఇక రోహిత్ శర్మ అది మంచి మనసు అని… అందుకే మహమ్మద్ సిరాజ్ కు ముంబై స్టేడియంలో రింగ్ ఇచ్చినట్లు తెలిపాడు. వాళ్ళిద్దరిది మంచి ఫ్రెండ్షిప్ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, బీసీసీఐ ఇచ్చిన ఈ రింగ్స్ చేయడానికి దాదాపు 450 గంటల సమయం పట్టింది. 60 గ్రాముల బరువున్న ఈ రింగ్ 18k బంగారంతో చేశారు. 330 సహజ తెల్లని వజ్రాలతో దీన్ని చేశారు.
Also Read: Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే
Rohit Sharma honours Mohammad Siraj with a special ring. ❤️💍pic.twitter.com/I6pHjA0Bb7
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2025