Indians High BP| ఒత్తిడితో కూడిన నేటి జీవనంలో రక్తపోటు సమస్య సాధారణమైపోతోంది. అయితే 40 ఏళ్ల లోపు భారత యువతలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉండడం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒకప్పుడు వృద్ధులు, మధ్య వయస్కుల్లో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 20 నుండి 40 ఏళ్ల వయసులో వారిని కూడా పట్టిపీడిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ఇండియా డయాబెటిస్ (ICMR-INDIAB) అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 35.5 శాతం మంది పెద్దలకు హై బీపీ ఉంది. 20-40 ఏళ్ల వయస్సు గల ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో 20-29 ఏళ్ల వయస్సు గల పురుషులలో 30.5 శాతం మందికి అధిక రక్తపోటు ఉందని తెలుస్తోంది. ఈ గణాంకాలు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
హై బీపీ అంటే ఏమిటి?.. ఇది ఎందుకు ప్రమాదకరం?
డాక్టర్ గోవింద్, కపివా యొక్క చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రకారం.. రక్తపోటు అనేది రక్తం.. ధమనుల గోడలపై చూపే ఒత్తిడి. ఈ ఒత్తిడి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కానీ నిరంతరం అధికంగా ఉంటే అది హై బీపీగా పిలువబడుతుంది. “ఈ సమస్యకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ ఇది గుండె, మూత్రపిండాలు, మెదడును నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది,” అని డాక్టర్ గోవింద్ వివరించారు. ఈ ఒత్తిడి ప్రమాదకరంగా పెరగడానికి ముఖ్య కారణం మన జీవనశైలి.
యువతలో హై బీపీకి కారణాలు ఏమిటి?
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. 9 నుండి 5 గంటల ఆఫీసు ఉద్యోగాలు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తినడం. వ్యాయామం లేకపోవడం.. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వంటివి హై బీపీకి ప్రధాన కారణాలు. “ఒత్తిడి నిరంతరం ఉంటే, కార్టిసాల్ సమతుల్యత దెబ్బతింటుంది, బరువు పెరుగుతుంది, నిద్ర సరిగా రాదు, ఇవన్నీ రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి,” అని డాక్టర్ గోవింద్ చెప్తున్నారు. ఆధునిక వైద్యం లక్షణాలను తగ్గించినప్పటికీ, ఆయుర్వేదం ఈ సమస్యను సమర్థవంతంగా నిర్వహించే మార్గాన్ని అందిస్తుంది.
హైబిపీకి ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేదంలో దోష సమతుల్యత, లక్షణాలు
ఆయుర్వేదం వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలపై ఆధారపడి ఉంటుంది. హై బీపీ సమస్యలు తరచూ పిత్త దోష అసమతుల్యతతో సంబంధం కలిగి ఉంటాయి. “వేయించిన, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం, అనియత దినచర్య, అధిక ఒత్తిడి వల్ల పిత్త దోషం పెరుగుతుంది. ఇది చిరాకు, ఆమ్లత్వం, తలనొప్పి.. చివరికి హై బీపీకి దారితీస్తుంది,” అని డాక్టర్ గోవింద్ వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి సహాయపడే ఆయుర్వేద మూలికలు
ఆయుర్వేద మూలికలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొన్ని ముఖ్యమైన మూలికలు:
అర్జున: గుండె బలాన్ని పెంచుతుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, మరియు రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది.
అశ్వగంధ: ఒత్తిడిని తగ్గిస్తుంది, నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది, మరియు గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది.
శంఖపుష్పి: మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆందోళనను నియంత్రిస్తుంది, మరియు రక్తపోటును స్థిరీకరిస్తుంది.
గుగ్గుల్: కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది మరియు శరీరంలో వాపును తగ్గిస్తుంది.
సూర్యోదయానికి ముందు లేవండి: ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. రోజును శాంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.
వెచ్చని, వండిన ఆహారం: ఖిచ్డీ, తేలికపాటి సూప్‌లు, ఆవిరితో ఉడికించిన కూరగాయలు జీర్ణక్రియకు మంచివి.
సాత్విక ఆహారం: తాజా, సీజనల్, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోండి.
రాత్రివేళ ఫోన్, టివి, స్నాక్స్‌కు దూరంగా ఉండండి : ఇది మెలటోనిన్‌ను నియంత్రిస్తుంది మరియు గాఢ నిద్రకు సహాయపడుతుంది.
యోగా మరియు ప్రాణాయామం: అనులోమ-విలోమ శ్వాస, శవాసన వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
రసాయన చికిత్స: ఒత్తిడి వల్ల వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read: నెలరోజుల పాటు డిన్నర్ తినకుంటే.. ఆరోగ్యంపై ప్రభావముంటుందా?
ఈ చిన్న మార్పులు మీ శరీరాన్ని ప్రకృతితో సమన్వయం చేస్తాయి. హై బీపీని నివారించడంలో సహాయపడతాయి.