Kannappa Movie Story: మంచు విష్ణు (Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగానే సినిమాకు సంబంధించి రోజుకొక విషయాన్ని విడుదల చేస్తూ అభిమానులకు సినిమాపై ఆసక్తి కలిగించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా కన్నప్ప స్టోరీ ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇది చూసిన నెటిజన్స్ ఇందులో కొత్త ఏముంది శివయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కన్నప్ప స్టోరీ ఇదేనా.. వీడియోలో ఏముందంటే?
ఇక ఆ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే.. తిన్నడు వాయు శివలింగం నుండి ఒక కంటిలో నీరు రావడం గమనిస్తాడు. అయ్యో శివయ్య ఎందుకు నీకు ఈ కష్టం.. అసలేమైంది అని ప్రశ్నించేలోపే.. ఆ కంటి నుండి నీరు మాయమై రక్తం కారుతుంది. నేను చేసిన పాపం ఏంటి అని ఆలోచిస్తూ.. తన కన్ను పీకి.. రక్తం కారుతున్న కంటికి పెడతాడు. రక్తం కారడం ఆగిపోతుంది. అంతలోనే మరో కంటి నుండి రక్తం కారుతూ ఉండగా.. ఇంకో కన్ను కూడా పీకేస్తే మళ్లీ అతికించేటప్పుడు కనిపించదని, తన కాలి బొటన వేలుతో.. రక్తం కారుతున్న ఇంకో కంటి పైన అదిమిపెట్టి క్షమించండి శివయ్య.. రెండు కళ్ళు పీకేస్తే ఆనవాళ్ళ కోసం ఇలా పెట్టాను అంటూ రెండవ కన్నును కూడా తీసి పెడతాడు. అప్పుడు వాయి శివలింగం శాంతిస్తుంది. ఇంతలోనే తిన్నడు కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. వెంటనే శివపార్వతుల ప్రత్యక్షమై.. నీ భక్తికి మెచ్చాను అని తిన్నడుకి రెండు కన్నులు ఇచ్చి శివయ్యకే కన్నులు ఇచ్చిన నీవు కన్నప్పగా పేరు పొందుతావని పార్వతి దేవి చెబుతుంది. శివయ్య మాట్లాడుతూ.. కన్నప్ప నువ్వు నా హృదయంలో చోటు సంపాదించుకున్నావు. భగవంతుడి శక్తి కన్నా భక్తుడి భక్తే ఎక్కువ అని నిరూపించావు. ఇకపై నా ఆలయం పైన నీ ఆలయం ఉంటుంది” అంటూ చెప్పి మాయమైపోతారు ఇక ఇదే ఈ సినిమా స్టోరీ అంటూ ఒక యానిమేటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్స్ ఇదే స్టోరీనా.. ఇందులో కొత్త ఏముంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి జూన్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
కన్నప్ప తారాగణం..
కన్నప్ప తారాగణం విషయానికి వస్తే.. మోహన్ బాబు(Mohanbabu ), మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్ లాల్ (Mohan Lal), ప్రభాస్(Prabhas ), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకులలో ఆసక్తి నెలకొన్నా.. దీనిపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు కూడా ఆకట్టుకోలేదు. పైగా టీజర్ లో ప్రభాస్ లుక్ మినహా ఏది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
also read:Film industry: ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ పాప్ సింగర్ తండ్రి మృతి!
Kannappa movie story idhena🤯 Vintuntene goosebumps vastunai🙇🏻
Promotions ante ila untai @HHVMFilm pic.twitter.com/h2zyRnsL2E
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 1, 2025