Film industry: ఇండస్ట్రీలో విషాదాలు ఒకదాని తర్వాత ఒకటి అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషాదాలు ఇండస్ట్రీలో మరింత దుఃఖాన్ని మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. స్టార్ సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాలవల్ల తనువు చాలిస్తున్నారు. ఇంకొంతమంది సెలబ్రిటీల ఇళ్లల్లో వ్యక్తులు వివిధ కారణాల వల్ల మరణిస్తూ ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా (Rihanna) ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. రిహాన్నా తండ్రి రోనాల్డ్ ఫెంటీ 70 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోనాల్డ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. లాస్ ఏంజెల్స్ లో ఆయన చనిపోయారని , చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రిహన్నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి రోనాల్డ్, తల్లి మోనిక మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ప్రస్తుతం రిహన్నా గర్భిణీ కాగా, తండ్రి మరణం ఆమెను మరింత విషాదంలోకి నెట్టివేసింది.
రాబిన్ రిహన్నా ఫెంటీ కెరియర్..
సంగీత ప్రపంచంలో బాగా పాపులర్ అయిన రాబిన్ రిహన్నా ఫెంటీ 1988లో బార్బడాస్ లోని మోనిక ఫెంటీ , రోనాల్డ్ ఫెంటీ దంపతులకు మూడవ సంతానంగా జన్మించింది.. ఈమెకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్న వయసులోనే అనేక సమస్యలు ఎదుర్కొంది. పుట్టుకతోనే వచ్చిన మధురమైన గొంతుతో ఈ స్థాయికి ఎదిగిన ఈమ.. స్కూల్లో చదువుకునేటప్పుడే తన స్నేహితులతో కలిసి సరదాగా పాటలు పాడేది. 2003లో క్రిస్మస్ వెకేషన్ లో భాగంగా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత రోజర్ కుటుంబంతో బార్బోడోస్ సందర్శించారు. ఆ సమయంలో ఈమె గొంతు విన్న ఆయన ఆమెతో కలిసి కొన్ని పాటలు రికార్డు చేద్దామని న్యూయార్క్ కి ఆహ్వానించారు. ఇక అప్పుడు ఆయనతో కలిసి డజన్ల సంఖ్యలో పాటలను కంపోస్ట్ చేసింది. ఆ ఆల్బమ్ ను 2005లో విడుదల చేయగా.. ఈమెకు మంచి గుర్తింపు అందించింది.
ఫోర్బ్స్ జాబితాలో సంపన్న గాయనిగా రికార్డ్..
ఇకపోతే పాప్ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. 2000 దశాబ్దపు కాలంలో ‘డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్’ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే గాయనిగా పేరు సొంతం చేసుకున్న ఈమె 2017లో బ్యూటీ పేరుతో ఒక కంపెనీని స్థాపించింది. మహిళలు ఎక్కడికి వెళ్లినా వాడుకోగలిగిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడంలో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.7 బిలియన్ డాలర్లు ఉండడంతో ఫోర్బ్స్ జాబితాలో ఈమె అత్యధిక సంపన్నురాలిగా రెండవ స్థానంలో నిలిచింది.. ఇక బ్యూటీ ప్రొడక్ట్స్ ఏ కాకుండా లో దుస్తులను కూడా విక్రయిస్తూ భారీ సంపాదన పొందుతోంది. ఇకపోతే అత్యధిక సంపన్నుగాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమెకు ఇప్పుడు తండ్రి వియోగం మరింత దుఃఖాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
ALSO READ:Kamal Haasan: మీరు దయచేసి రిటైర్మెంట్ తీసుకోండి.. ఆ నలుగురు దొరికేశారు.. కమల్‌కి నెటిజన్ ఝలక్!