BigTV English

Kannappa: ‘కన్నప్ప’ రన్ టైమ్ లాక్.. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంతంటే?

Kannappa: ‘కన్నప్ప’ రన్ టైమ్ లాక్.. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంతంటే?

Kannappa:కన్నప్ప(Kannappa).. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండీ విడుదలైన పోస్టర్స్, నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. పైగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ రీ వర్క్ తో అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు కన్నప్ప టీమ్. ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అటు ప్రభాస్ లుక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు పెరిగాయి.


రన్ టైమ్ లాక్.. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంతంటే..?

మంచు విష్ణు కూడా ఒకవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. పలు విషయాలను పంచుకుంటున్నారు. మొన్నటి వరకు వ్యక్తిగత, ఫ్యామిలీ విషయాలను పంచుకున్న ఈయన , ఇప్పుడు సినిమా గురించి తెలిపారు. తాజాగా ఈ సినిమా రన్ టైం అలాగే ప్రభాస్ (Prabhas) స్క్రీన్ స్పేస్ ఎంత అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. కన్నప్ప రన్ టైం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. “కన్నప్ప సినిమా రన్ టైం 3:10 గంటలు.. మూడు నిమిషాల టైటిల్ రోలింగ్ తో కలిపి ఈ నిడివి ఉంటుంది. ఇందులో 30 నిమిషాల పాటు ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. అయితే ప్రభాస్ ను ఎక్కువసేపు చూపించాలి అనుకున్నాం. కానీ సినిమా నిడివి ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ప్రభాస్ సన్నివేశాలన్నీ ట్రిమ్ చేసేసరికి 30 నిమిషాలు వచ్చింది. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సినిమాలో కథను మలుపు తిప్పుతుంది.. ముఖ్యంగా ఆ 30 నిమిషాలు సినిమాకే హైలెట్” అంటూ ప్రభాస్ పాత్ర పై హైప్ పెంచేశారు మంచు విష్ణు.


మా సినిమా అద్భుతంగా వచ్చింది – మంచు విష్ణు..

మరొకవైపు మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ..” ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలు ఉంటుంది” అంటూ తెలిపారు. అలాగే రన్ టైం గురించి మాట్లాడుతూ.. “సాధారణంగా సినిమా కంటెంట్ బాగుంటే మూడు గంటలు కాదు మూడున్నర గంటలైనా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఒకవేళ కంటెంట్ బాగా లేకపోతే రెండు గంటల సినిమా కూడా బోర్ కొడుతుంది. కానీ మా సినిమాలో మీకు ఎక్కడ అలాంటి ఫీలింగ్ కలగదు. కచ్చితంగా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది” అంటూ తన సినిమా గురించి చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇకపోతే మహాభారతం టెలివిజన్ షో కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు తోపాటు పలువురు భారీ తారాగణం భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచు విష్ణు కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ALSO READ:Manchu Manoj : ఫ్యామిలీ ఎఫెక్ట్… రెండో సారి కులం మార్చిన మంచు అన్న… ఈసారి ఏ కులం అంటే..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×